BigTV English
Advertisement

Thandel movie: ‘తండేల్’.. బాలీవుడ్ మూవీని కాపీ కొట్టారా..?

Thandel movie: ‘తండేల్’.. బాలీవుడ్ మూవీని కాపీ కొట్టారా..?

Thandel movie: తెలుగు సినిమాల్లో ఈమధ్య ఎక్కువగా రొమాంటిక్ స్టోరీలు ప్రేమ కథ చిత్రాలని దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ ప్రేమ కోసం హీరో చేసే సాహసాలు త్యాగాలు సినిమాలకు హైలైట్ గా నిలుస్తాయి అలాంటి సినిమాలపైనే జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కొన్ని సినిమాల్లో ప్రేమ కోసం హీరోలు దేశ సరిహద్దులను దాటుతారు. తాజగా, టాలీవుడ్‌లో విడుదలైన తండేల్ ట్రైలర్ చూస్తే, హీరో దేశం బోర్డర్ దాటి తన ప్రేమను తిరిగి గెలుచుకోవడం కోసం తిరిగి వచ్చే కథలా కనిపిస్తుంది. పాకిస్తాన్ నుంచి హీరో హీరోయిన్ కోసం ఎలా వచ్చాడు? ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడనేది? ఈ సినిమా స్టోరీ లా ఉందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.. అయితే ఈ సినిమా మొత్తం బాలీవుడ్ లోని ఓ సినిమాను కాపీ కొట్టారని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఆ సినిమా ఏంటి? ఆ సినిమా స్టోరీ ఏంటో? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


తండేల్ మూవీ.. 

అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగచైతన్య నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తండేల్.. పాన్ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.. చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.. అయితే గతంలో చైతూ చేసిన ఏ సినిమాకు కూడా ఇంత హైప్ రాలేదు. కథ కొత్తగా ఉండటంతో పాటు పాటలు ఇప్పటికే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాను దాదాపు 70 కోట్లతో నిర్మించారని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఇతర ప్రోమో వీడియోల్లో సాయిపల్లవి డ్యాన్స్ అదిరిపోయింది. ఇక పూర్తి సాంగ్స్ లో ఆమె డ్యాన్స్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


తండేల్ ‘గదర్ ‘ మూవీ కాపీనా..? 

ఈ సినిమా స్టోరీ తెలుగు ప్రేక్షకులకు కొత్తగాని బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇలాంటి స్టోరీని ఓ మూవీలో చూసామని అంటున్నారు. గతంలో బాలీవుడ్‌లో గదర్ సినిమాలో కూడా చూసాం. ఆ మూవీలో కూడా హీరో తన ప్రేమ కోసం పాకిస్థాన్‌లోని లాహోర్ వరకు వెళ్లి అక్కడ యుద్ధం చేస్తాడు. ఆ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.. అంతేకాదు మంచి వసూళ్లను కూడా కలెక్ట్ చేసింది.. అలాంటి స్టోరీ తోనే రాబోతున్న ఈ సినిమాకు అంతే రెస్పాన్స్ వస్తుందా లేక కాపీ అని ముద్ర పడుతుందా అనేది తెలియాలంటే సినిమా వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు.. ఇకపోతే నాగ చైతన్య గత సినిమాలు పెద్దగా విజయాలు సాధించని నేపథ్యంలో తండేల్ సినిమా పై అంచనాలు భారీగా ఉండడం ఫ్యాన్స్ ను సంతోష పరిచే విషయం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో ఫిబ్రవరి 7 న తెలిసే అవకాశాలు ఉన్నాయి.. ఏది ఏమైనా నాగచైతన్య ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బాగుందని టాక్ వినిపిస్తుంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×