Mrunal Thakur: ఇండియన్ సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతారు. అలాంటి వారిలో మనం చెప్పుకోబోయే ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. సీరియల్స్ తో తన సినీ ప్రస్థానం స్టార్ట్ చేసి ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆమెనే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే ఈ పోస్టు చూసిన చాలామంది నెటిజన్లు ఇదేంటి ఈ హీరోయిన్ కి ఏమైనా పిచ్చి పట్టిందా..? ఇలాంటి పోస్ట్ పెట్టిందేంటి? అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ పెట్టిన ఆ పోస్ట్ ఏంటి? ఎందుకు సోషల్ మీడియా జనాలు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
కమల్ హాసన్ తో డాన్స్ చేయాలని ఉంది – మృణాల్ ఠాకూర్
తెలుగులో ‘సీతారామం’ (Sitharamam) సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లోకి వెళ్ళింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా తర్వాత ‘హాయ్ నాన్న'(Hai Nanna), ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా లస్ట్ స్టోరీస్ -2(Lust Stories-2) వెబ్ సిరీస్ లో మరింత గ్లామర్ గా నటించి, బాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిపోయింది. ఇక మొదట బాలీవుడ్లో పలు సీరియల్స్ చేసి సినిమాల్లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ తెలుగులో మాత్రం సీతారామం సినిమాతో ఫేమస్ అయిపోయింది. అయితే అలాంటి మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందంటే..”నాకు కమల్ హాసన్ (Kamal Haasan) సార్ అంటే చాలా అభిమానం. ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఉంది. అంతేకాదు ఆయనతో కలిసి డాన్స్ చేయాలని కూడా ఉంది”అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
నెటిజన్స్ ట్రోల్స్ వైరల్..
అయితే మృణాల్ పెట్టిన ఈ పోస్టు బాగానే ఉంది కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం ఈ పోస్ట్ ని వక్రీకరించి మృణాల్ ఠాకూర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.ముసలోడితో దసరా పండగ అన్నట్లు ముసలి హీరోతో నువ్వు డాన్స్ చేస్తా అనడం ఏంటి? మంచి ఏజ్ లో ఉన్న యంగ్ హీరోయిన్ వి. యంగ్ హీరోస్ తో వర్క్ చేయాలి. యంగ్ హీరోలతో డాన్స్ చేయాలి అని కలలు కనాలి కానీ ఇలాంటి ముసలి హీరోతో డాన్స్ చేయాలంటున్నావు ఏంటి ?అంటూ చాలామంది నెటిజన్లు మృణాల్ ఠాకూర్ పెట్టిన పోస్ట్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ తో వర్క్ చేయాలని చాలామంది యంగ్ హీరోయిన్లు కూడా అనుకుంటారు.అలాంటి వారిలో మృణాల్ కూడా ఒకరు.అలా తన మనసులో మాట బయట పెట్టినందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది.
ALSO READ:Partho Ghosh: ఇండస్ట్రీలో విషాదం..’అగ్నిసాక్షి’ డైరెక్టర్ మృతి!