Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలా నటుడిగా అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఈయన పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం హీరోగా కొనసాగుతూ అక్కినేని లెగసినీ కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఈయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున హీరోగా ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇప్పటికి కూడా ఈయన వరుస సినిమాలలో నటించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు.
క్యామియో పాత్రలు…
ఇక నాగార్జున త్వరలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా(Kubera Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలలో తన పాత్ర గురించి తెలియజేస్తున్నారు. ఇకపోతే త్వరలోనే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి(Coolie) సినిమాలో కూడా నాగార్జున ఒక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా నాగార్జున సోలో హీరోగా సినిమాలు చేయడం పూర్తిగా పక్కన పెట్టి స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మొహమాటం లేదు…
సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన తర్వత ఇతర సినిమాలలో పలు పాత్రలలో నటించడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ నటించిన ఆ పాత్ర కూడా హీరోకి సమానంగా ఉంటే తప్ప సినిమాలు చేయటానికి ఒప్పుకోరు.. ఇక చిన్న హీరోల సినిమాలలో అయితే అసలు నటించరు. ఈ విషయంలో మాత్రం నాగార్జున అందరి హీరోలకు చాలా భిన్నం అని చెప్పాలి. ఈ విషయంలో నాగార్జున తన స్టార్ డం పక్కనపెట్టి పెద్ద హీరోల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.
బిగ్ బాస్ హోస్ట్…
చిన్న హీరోల సినిమాలలో నటించడానికి నాగార్జున ఏమాత్రం మొహమాట పడరని చెప్పాలి. ఈయనకు కథ నచ్చితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో అయినా, యంగ్ హీరో రోషన్ తో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా నాగార్జునకు సాటిరారు. ఇలా పలు సినిమాలలో క్యామియో పాత్రలలో నటిస్తూ నాగార్జున తనదైన శైలిలోనే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక నాగర్జున హీరోగా చివరిగా నా సామిరంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో నాగార్జున మెయిన్ హీరో అయినప్పటికీ అల్లరి నరేష్ రాజు తరుణ్ వంటి వారు నటించారు. ఇక ఈయన మరోవైపు బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నారు.
Also Read: Star Actor Death: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు డేవిడ్ కన్నుమూత!