Nagarjuna.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు ఏఎన్ఆర్ (ANR ) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాగార్జున (Nagarjuna). అక్కినేని నాగేశ్వరరావు – అన్నపూర్ణ దంపతులకు 1959 ఆగస్టు 29న జన్మించిన అక్కినేని నాగార్జున రావు.. తొలిసారి ‘విక్రమ్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 1986 మే 23న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రం హిందీ సినిమా ‘హీరో’కి రీమేక్ గా విడుదలయ్యింది. ఇక తర్వాత వరుస సినిమాలలో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున తన సినీ కెరియర్ లోనే దాదాపు 100కి పైగా చిత్రాలలో హీరోగా నటించారు. ముఖ్యంగా వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా అందులో కొన్ని తమిళ్, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి మొత్తం తొమ్మిది నంది అవార్డులు, మూడు సౌత్ ఫిలింఫేర్ అవార్డులతో పాటు రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా అందుకున్నారు.
నాగార్జున హీరో పాత్రలకు రిటైర్మెంట్ తీసుకున్నారా..?
ఇకపోతే నాగార్జున తన సినిమాలతో నవ మన్మధుడిగా, మాస్ హీరోగా, కింగ్ గా పేరు దక్కించుకున్నారు. అంతేకాదు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, హథిరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర ఆధారితంగా రూపొందిన చిత్రాలలో కూడా నటించారు. ఇక 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. అలా ‘అన్నపూర్ణ స్టూడియోస్’ అనే నిర్మాణ సంస్థకు అధినేత కూడా.. హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా ఈయన నడుపుతున్నారు. ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో ఈయన తోటి తరం హీరోలలో చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్(Venkatesh), బాలకృష్ణ (Balakrishna) వంటి హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ నాగార్జున మాత్రం హీరోగా ఇప్పటివరకు సినిమా ప్రకటించకపోవడంతో.. కొంప తీసి హీరో క్యారెక్టర్ నుండి నాగార్జున రిటైర్మెంట్ తీసుకున్నారా? అనే నెటిజన్స్ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
వరుస పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నాగ్..
ఇలాంటి వార్తలు రావడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున అన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా వస్తున్న ‘కుబేర’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.అలాగే రజినీకాంత్ (Rajinikanth ) హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పుడు సంజయ్ దత్ నటిస్తున్న ‘మున్నా భాయ్ 3’ సినిమాలో కూడా నటించబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మున్నా భాయ్ ఫ్రాంచైజీలో ఇప్పుడు నాగార్జున భాగం కాబోతున్నారని తెలిసి నాగార్జున వరస పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు ఒప్పుకుంటున్నారు. కొంపతీసి హీరో క్యారెక్టర్ కి రిటైర్మెంట్ కానీ తీసుకున్నారా ఏంటి అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు నెటిజెన్స్ కూడా ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడే వద్దు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది హీరో గానే సినిమాలు చేయండి అంటూ కోరుకుంటున్నారు. మరి నాగార్జున హీరోగా ఎప్పుడు సినిమా ప్రకటిస్తారో చూడాలి.