Rajal Arora: భారత పురుషుల జట్టుతో ఉన్న ఈమె ఎవరో తెలుసా..? ఈమె ఎప్పుడూ పురుషుల క్రికెట్ టీమ్ తో ఎందుకు ఉంటుంది..? టీమిండియా క్రికెటర్లు, హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫిజియోలు.. ఇలా అంతా మగవారే ఉన్న ఈ స్టాఫ్ లో ఉన్న మిస్టరీ గర్ల్ ఎవరు అంటే..? మీకు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ పై ఏదైనా అవగాహన ఉందా..? అలా టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న ఏకైక యువతి ఈమెనే. ఈమె గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
Also Read: Ajinkya Rahane: రహానే భారీ సెంచరీ.. టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఖాయం ?
దీంతో అసలు ఈమె ఎవరంటూ వెతకడం ప్రారంభించారు క్రీడాభిమానులు. చాలాకాలంగా భారత పురుషుల జట్టుతో కలిసి పనిచేసే ఈ మహిళ పేరు రాజల్ అరోరా. ప్రపంచ క్రికెట్ లో భారత జట్టును ప్రత్యేకంగా చూపించడంలో ఈ మహిళ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. ఈమె భారత పురుషుల క్రికెట్ జట్టు సోషల్ మీడియాకి అధిపతి. పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ నుండి రాజల్ ఆరోరా {Rajal Arora} గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది.
ఆ తర్వాత కంటెంట్ రైటర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. అనంతరం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా {బిసిసిఐ} సోషల్ మీడియా విభాగంలో మేనేజర్ గా ఎంపికైంది. ఇక దాదాపు 9 సంవత్సరాల తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ గా పదవిని చేపట్టింది. ప్రస్తుతం {Rajal Arora} భారత పురుషుల జట్టు సోషల్ మీడియాని నిర్వహించడంతోపాటు, బీసీసీఐలో అంతర్గత ఫిర్యాదు కమిటీకి కూడా అధిపతిగా ఉంది.
ఈమె ఆటగాళ్ల దుష్ప్రవర్తన ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంది. జట్టులో ఈమెని రాజల్ అని పిలుస్తారు. ఈమె టీమిండియా, ఐపీఎల్, ఉమెన్ ప్రీమియర్ లీగ్ లకు డిజిటల్ అండ్ మీడియా మేనేజర్ గా వ్యవహరిస్తోంది. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలా చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో టీమిండియా కు సంబంధించిన అన్ని అప్డేట్స్, హైలెట్స్, వార్తా విషయాలను మేనేజ్ చేస్తుంది. 2015లో ఈమె {Rajal Arora} సోషల్ మీడియా మేనేజర్ గా బీసీసీఐలో చేరింది. ఈమెకి చిన్నప్పటినుండి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.
Also Read: Virender Sehwag: సెహ్వాగ్ కాపురంలో చిచ్చుపెట్టిన కారు.. విడాకులకు ఇదే కారణం ?
స్కూల్ డేస్ లోనే బాస్కెట్ బాల్, షూటింగ్ ఆడేది. తరచూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. రాజల్ కి భారత వికెట్ కీపర్ కే.ఎల్ రాహుల్ భార్య అతియా శెట్టితో ప్రత్యేక బంధం ఉంది. వీరిద్దరూ తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ కనిపిస్తారు. గతంలో కూడా ఈమె గురించి పలు కథనాలు వెలువడ్డప్పటికీ.. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ఈమె మరోసారి వైరల్ గా మారింది. దీంతో క్రీడాభిమానులు ఈమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.