BigTV English

Akkineni Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఎమోషనల్ ట్వీట్..

Akkineni Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఎమోషనల్ ట్వీట్..

Akkineni Nagarjuna : కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు జరుగుతున్నాయని టాలీవుడ్ సీనియర్ హీరో, అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని హీరో నాగార్జున వాపోయారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం.. కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసమే ఈ పోస్ట్ చేస్తున్నట్టు రాసుకొచ్చారు.


ఎన్ కన్వెన్షన్‌ భూమి పట్టా భూమి అని ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని అన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడిందని స్పష్టం చేశారు. కూల్చివేత తప్పుడు సమాచారంతో చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున అన్నారు. కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే తానే కూల్చివేత నిర్వహించేవాడినన్నారు.

ఆక్రమణలు చేసి తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని వాపోయారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే ప్రధాన ఉద్దేశమని ట్వీట్ చేశారు. అధికారులు చేసిన చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు.


 

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×