Nagarjuna – NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రీమేక్ సినిమాలు ఎక్కువగా కనిపించాయి. కానీ ఈమధ్య స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి అంటే అన్ని హిట్ అవ్వలేదు. ఇండస్ట్రీలో గత కొంతకాలంగా మల్టీ స్టారర్ ట్రెండ్ తెగ నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జనరేషన్‌లో మల్టీ స్టారర్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. ఈ మధ్య తెలుగులో మల్టీ స్టారర్ కథలతో వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే ఎన్టీఆర్ – నాగార్జున కాంబోలో మూవీ అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు మ్యాటారేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొన్నటివరకు మల్టీ స్టారర్ సినిమాలు ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత మాస్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు మళ్లీ మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. మల్టిస్టారర్ సినిమాల ట్రెండ్ తగ్గినా.. ఇటీవల మల్టీ స్టారర్ ట్రెండ్ మరోసారి మొదలైంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు క్రియేట్ చేసిన ఆర్‌ఆర్ఆర్ సినిమానే నిదర్శనం. ఇక ఇలాంటి మల్టీస్టారర్ కాంబోలో ఎన్నోసార్లు ప్లాప్ అవుతుంటాయి.
అసలు విషయానికొస్తే.. గతంలో తారక్, నాగార్జున తో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉండగా.. తన క్యారెక్టరైజేషన్ నచ్చలేదని ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. ఊపిరి. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా కార్తీ సెకండ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్స్ అందుకుంది. ఆ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ ను హీరో అనుకున్నారు. ఎన్టీఆర్ డేట్స్ కుదరక, స్టోరీ కూడా నచ్చక పోవడం తోనే ఎన్టీఆర్ నో చెప్పాడని టాక్.. ఆ తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా దేవర సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ విజయాన్ని అందుకోవడం తో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు.. వార్ 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
ఇక నాగార్జున తమిళ హీరో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కుబేర సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధం అవుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల ను ఆకట్టుకున్నాయి.