KTR arrest tension: మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి వద్ద అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వికారాబాద్ ఘటన కేసులో ఆయన్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న వార్తలతో బీఆర్ఎస్ కేడర్ అలర్ట్ అయ్యింది.
అర్థరాత్రి హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానుల రాకను గమనించిన కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటన వెనుక బీఆర్ఎస్ నేతల హస్తముందని తేలిపోయింది. చివరకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్ చేశారు. ఆయన్ని ఏ1 గా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు.
విచారణ క్రమంలో కేటీఆర్ పాత్ర ఉందని నరేందర్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేటీఆర్ ఆదేశాల మేరకు సురేష్‌ను రంగంలోకి దింపినట్టు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారంపై కేటీఆర్ వైపు మళ్లింది.
ALSO READ: పట్నం రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనం.. కేటీఆర్ ప్లాన్ అదేనా? నాటి ఘోరాల సంగతేంటో?
ఏ క్షణంలోనైనా కేటీఆర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చునంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో బీఆర్ఎస్ హార్డ్‌కోర్ అభిమానులు రంగంలోకి దిగేశారు. అర్థరాత్రి నందినగర్‌లో ఉన్న కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. కార్యకర్తల రాకను గమనించిన పోలీసులు భారీ ఎత్తున మొహరించారు.
ఈలోగా ఇంట్లో నుంచి స్వయంగా కేటీఆర్ బయటకు వచ్చి వారితో మాట్లాడారు. దీంతో అక్కడ ప్రశాంత వాతావరణ నెలకొంది. అప్పటివరకు అభిమానులు నినాదాలు చేశారు. సెప్టెంబర్ ఒకటి నుంచి దాడి జరిగిన రోజు వరకు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో సురేష్ 84 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.
అందులో ఈనెల 2 నుంచి 9 మధ్య దాదాపు 34 కాల్స్ ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దాడి జరిగిన రోజు ఒక్కసారి మాత్రమే మాట్లాడాడు. లగచర్ల దాడి ఘటన కేసులో నిందితుల్లో 19 మందికి ఎలాంటి భూమి లేదని తేల్చారు. అధికారులను పంచాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందన్నది రిమాండ్ రిపోర్టులో ప్రధాన పాయింట్.
దాడి వ్యవహారంపై మంత్రులు సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. దాడి వెనుక ఎవరున్నా వదిలేదని లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తుందన్నారు. ఇందులో ఎంతటివారున్నా సహించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఒక కేసు నుంచి తప్పించుకునే క్రమంలో ఆ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తోందన్నారు మంత్రులు.
కేటీఆర్ అరెస్ట్ ప్రచారం.. తీవ్ర ఉత్కంఠ
కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
ఏ క్షణంలోనైనా కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం
వికారాబాద్ అధికారులపై దాడి ఘటనలో కేటీఆర్ పాత్ర ఉందని తేల్చిన రిమాండ్ రిపోర్టు… pic.twitter.com/21W76hFuf7
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2024