BigTV English
Advertisement

Nagarjuna: తండ్రికి భయపడి అలాంటి పని చేసిన నాగార్జున..మరీ ఇలా అయితే ఎలా గురూ..?

Nagarjuna: తండ్రికి భయపడి అలాంటి పని చేసిన నాగార్జున..మరీ ఇలా అయితే ఎలా గురూ..?

Nagarjuna: సినిమా సెలబ్రిటీలు ఆల్కహాల్ తీసుకోవడం అత్యంత సాధారణ విషయం.. ముఖ్యంగా కొంతమంది ఇంట్లో ఆల్కహాల్ సేవిస్తే, మరి కొంతమంది పార్టీలు, పబ్బుల్లో లేదా రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఏకంగా తమ ఇళ్లల్లోనే ప్రత్యేకంగా పబ్ లు కూడా ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంకొంతమంది తల్లిదండ్రులకు భయపడి ఆల్కహాల్ సేవించడానికి ఎన్నో మార్గాలు చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున కూడా తన తండ్రి నుంచి తప్పించుకుని బీరు తాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.


అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున మాత్రమే అలా..

ప్రస్తుత కాలంలో ఏదైనా సరే ఈజీగా దొరుకుతుంది. అదే సమయంలో ఫ్రీడం కూడా ఉంటుంది. ఇక ఎవరైనా తీసుకునే అంత స్వేచ్ఛ పెద్దలు కూడా ఇస్తున్నారు. అలాగే పిల్లలు కూడా తీసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఈ స్వేచ్ఛ ఇలా ఉండేది కాదు. ఒకవేళ పిల్లలు చెడు అలవాట్లకు గురవుతున్నారు అంటే పెద్దలు మందలించేవాళ్ళు. అలాంటిది అక్కినేని ఫ్యామిలీలో కూడా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు పిల్లల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. అల్లరి చిల్లరగా ఏమాత్రం తిరగనిచ్చే వారు కూడా కాదు. ఇక వెంకట్ ఇతర పిల్లలంతా బాగా ఉండేవారు. కానీ నాగార్జున మాత్రం కాస్త అల్లరి ఎక్కువ. అల్లరి పనులు చేస్తూ ఇంట్లో కూడా దొరికిపోయేవారట.


తండ్రికి తెలియకుండా అలాంటి పని..

ఇకపోతే నాగార్జునకి బీరు తాగే అలవాటు ఉంది. ఈ విషయం తండ్రికి తెలిస్తే ఎక్కడ మందలిస్తాడో అని.. దొంగ చాటున బీరు తాగే వారట. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోని వాడుకునే వారట నాగార్జున. ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేదట. అది కాస్త కొద్దిగా అడవిని తలపిస్తూ ఉండేదని సమాచారం. తాను బీర్ తాగాలనుకుంటే నెమ్మదిగా బాటిల్ తీసుకొని ఆ చెట్ల మధ్యలోకి వెళ్లి ఎవరు చూడకుండా ఆ ఫారెస్ట్ లో బీరు తాగి వచ్చేవారట నాగార్జున. అయితే ఈ విషయాన్ని ఆయన ఒక ప్రెస్ మీట్ లో తెలిపినట్లు సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోలో ఎవరికి తెలియని ప్లేస్ లు ఎన్నో..

ఇకపోతే అన్నపూర్ణ స్టూడియోలో తనకు తెలియని ప్లేసులు ఎన్నో ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక నాగార్జునకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసి బీరు తాగడానికి నాగార్జున ఇన్ని తిప్పలు పడ్డారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే.. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత మాస్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.
ఆ తర్వాత మన్మధుడిగా, కింగ్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. గత ఐదు సీజన్లుగా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు హోస్ట్ గా.. మరొకవైపు హీరోగా బిజీగా మారిపోయారు నాగార్జున. అలాగే రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×