ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో పవన్ ఏన్డీఏ పెద్దలతో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో హోం మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కాబోతున్నట్టు సమాచారం అందుతోంది. గతంలో పవన్ అనేకసార్లు అమిత్ షాతో భేటీ అయ్యారు. కానీ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తరవాత ఆయన మొదటిసారి ఢిల్లీలో పర్యటిస్తూ ఎన్డీఏ పెద్దలను కలవబోతున్నారు. దీంతో పవన్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో పవన్ అమిత్ షాతో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also read: బంగారు తెలంగాణ అంటూ.. బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది.. హరీష్ కు రాజ్యాంగం తెలుసా?
పవన్ మొదటిసారి అమిత్ షాతో భేటీ కానుండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఏపీలో రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ తో ప్రచారం చేయించాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి జనసేన బీజేపీల పొత్తుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేనానికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్ కల్యాణ్ స్పందించిన తీరుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పవన్ తో మహారాష్ట్రంలో దింపాలని బీజేపీ భావిస్తోంది.