BigTV English

Akkineni Nagarjuna: నాన్నగారి బయోపిక్ సినిమా తీద్దామంటే, నాగార్జున ఏమన్నారో తెలుసా.?

Akkineni Nagarjuna: నాన్నగారి బయోపిక్ సినిమా తీద్దామంటే, నాగార్జున ఏమన్నారో తెలుసా.?

Akkineni Nagarjuna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటివాళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అక్కినేని కుటుంబ సభ్యులంతా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. తన తండ్రి మాదిరిగానే అక్కినేని నాగార్జున కెరియర్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. శివ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చింది అంటే దానికి కారణం అక్కినేని నాగార్జున. ఒక ఆలోచనను నమ్మి డేరింగ్ గా స్టెప్ వేయడం మామూలు విషయం కాదు. ఇప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తావన వస్తే శివా సినిమాకి ముందు శివ సినిమా తర్వాత అని చెబుతూ వస్తున్నారు. ఇక ఆన్ స్క్రీన్ పై కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా తన థాట్ ప్రాసెస్ వలన చాలామందిని ఇన్ఫ్లెన్సు చేస్తూ ఉంటారు నాగార్జున.


బయోపిక్ గురించి నాగార్జున మాటల్లో

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని బయోపిక్ సినిమాలు వచ్చినా కూడా మహానటి సినిమాకి ఉన్న స్థానం వేరు. అంత అద్భుతంగా దర్శకుడు నాగి ఆ సినిమాను డిజైన్ చేశాడు. దాదాపు ఆడియన్స్ థియేటర్ కి రావడం మానేశారు అనుకున్న తరుణంలో ఒక మంచి కథను సినిమాగా తీస్తే ఖచ్చితంగా వస్తారు అని నిరూపించిన సినిమా మహానటి. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా మిగతా భాషలో ఆడియన్స్ కి కూడా ఆ సినిమా విపరీతంగా నచ్చింది. మహానటి సినిమా అయిపోయిన తర్వాత ఒక సందర్భంలో చాలామంది జర్నలిస్టులు నాగర్జున గారితో కలిసి మాట్లాడారట. మహానటి సినిమా వచ్చింది కదా నాన్నగారి బయోపిక్ కూడా ప్లాన్ చేద్దాం సార్ అంటే దానికి నాగర్జున ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.


జీవితంలో ఎత్తు పల్లాలు ఉండాలి

ప్రతి జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అలానే నాన్నగారి బయోపిక్ తీయడానికి అలాంటి అంశాలు ఏవి లేవు. నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు కొన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దర్శకుడు వి ఎన్ ఆదిత్య దేవదాస్ సినిమాని రీమేక్ చేసే ఆలోచనను ఒకసారి చెప్పారట. నాన్నగారు తీసిన కొన్ని సినిమాలు క్లాసిక్స్. ఒక కొడుగ్గా వాటిని పాడు చేయకుండా ఉండటం నా బాధ్యత అని చెప్పారట. ఈ మాట దర్శకుడు ఆదిత్య కు విపరీతంగా నచ్చిందట. ఈ సంభాషణ జరిగిన రెండేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో నేనున్నాను అనే సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

Also Read : Rohith Shetty : తెలుగు ఫిలిమ్స్ గురించి భారీ ఎలివేషన్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×