Rohith Shetty : ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వేరు ఇప్పుడు ఇండస్ట్రీ వేరు. అలానే బాలీవుడ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మంచి లవ్ స్టోరీస్, కాన్సెప్ట్ బేస్ సినిమాలన్నీ కూడా బాలీవుడ్ లోని నిర్మితమయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ అనేది వెనకబడింది అని చెప్పొచ్చు. ఏ సినిమా చేసినా కూడా అంతగా వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు ఇండియన్ సినిమా మాత్రమే కాకుండా ప్రపంచ సినిమా అంతా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చే సినిమాలుని చూసి ఆశ్చర్య పోతుంది అని చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమా కూడా ఒక మూసలో సాగుతుండేది. కానీ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. అక్కడి నుండే మిగతా దర్శకులు కూడా పాన్ ఇండియా సినిమా చేయాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు. సుకుమార్, నాగ అశ్విన్, సందీప్ రెడ్డి ,ప్రశాంత్ నీల్ వంగ వంటి దర్శకులు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయ్యారు.
రోహిత్ శెట్టి ఎలివేషన్
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. జమీన్ సినిమాతో బాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శెట్టి . ఆ తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయిన అనుకోకుండా ఒక రోజు, సింగం, టెంపర్ వంటి సినిమాలను కూడా రీమేక్ చేసి బాలీవుడ్లో తెరకెక్కించాడు. ఈయన తీసిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ప్రస్తుతం ఈ దర్శకుడు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాహుబలి కల్కి సినిమాలకు భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఈ సినిమాలు చూసి ఏదైనా నేర్చుకోవచ్చు అని మీకు అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అని జర్నలిస్ట్ అడిగినప్పుడు, బాహుబలి , కల్కి సినిమాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా కల్కి సినిమా సెకండాఫ్ తనకు విపరీతంగా నచ్చింది అంటూ చెప్పుకోచ్చాడు. రోహిత్ శెట్టి ఫ్యామిలీతో పాటు ఆ సినిమాను చూశారట. తన కొడుక్కు మరియు తన భార్యకు ఆ సినిమా విపరీతంగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు.
తెలుగు సినిమా స్థాయిని పెంచాయి
బాహుబలి ప్రత్యేకత అందరికీ తెలిసిన విషయమే. ఇక కల్కి విషయానికి వస్తే బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ హిట్ లేదు అనుకునే తరుణంలో నాగి కల్కి రూపంలో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు రాబోయే కల్కి టు గురించి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమా వచ్చిన తర్వాత చాలామంది రామాయణ ఇతిహాసాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిన తరుణంలో ఎటువంటి వైలెన్స్ లేకుండా ఈ సినిమాను 1000 కోట్ల వైపు తీసుకెళ్లామంటూ నాగి అప్పట్లో పెట్టిన పోస్ట్ కూడా సంచలనంగా మారింది.