అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో రవితేజ మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించబోతున్నాడు. అలాగే భాగ్యశ్రీ బ్యూటీ తన అందంతో సినీ అభిమానుల మనుసు కొల్లగొట్టేస్తుందని భావిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాను ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ డేట్ ఫిక్స్..రిలీజ్ ఎప్పుడంటే?
టీజర్ ప్రకారం.. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు, నల్లధనం అనే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దీని బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ మనీ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. ఈ డైలాగ్‌తో పాటు మరో డైలాగ్ కూడా ఫుల్ హైప్ క్రియేట్ చేసింది. సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాల్లాంటివి.. అవి వస్తుంటాయి పోతుంటాయి. కానీ యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది.. అది పోయేదాకా మనతోనే ఉంటుంది అనే డైలాగ్ కూడా అందరిలో ఆసక్తి రేపుతుంది. దీంతో ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.