Mr. Bachchan Movie Trailer Update: టాలావుడ్ మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీ అన్ని కమర్షియల్ ఎలింమెంట్స్‌తో ప్యేజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. తాజాగా, ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రకటించారు.
ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఆగస్టు 7 న విడుదల చేస్తున్నట్లు ఓ రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ భాగ్య శ్రీ, రవితేజ చాలా రొమాంటిక్ గా హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా..జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్ నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న విడుదల కానుంది.