BigTV English

Zaporizhzhia nuclear plant: జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు

Zaporizhzhia nuclear plant: జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలు

Zaporizhzhia nuclear plant: ఐరోపాకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా? రష్యా-ఉక్రెయిన్ వార్‌లో అసలేం జరుగుతోంది? ఉక్రెయిన్‌తో రష్యా పోరాటం చేయలేకపోతోందా? పైచేయి సాధించేందుకు రష్యా ఎత్తుకు పైఎత్తులు వేస్తోందా? జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ మంటల వెనుక అసలు కారణమేంటి? ఇలా రకరకాల ప్రశ్నలను యూరప్ దేశాలను వెంటాడుతున్నాయి.


రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నెలల తరబడి సాగుతోంది. ఉక్రెయిన్‌ను పూర్తిగా డ్యామేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కనబడుతోంది. వార్‌లో భాగంగా రెండేళ్ల కిందట జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌ను రష్యా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అక్కడ విద్యుత్‌ని నిలిపివేశాయి. అంతేకాదు ఆ రియాక్టర్లను నాలుగునెలల కిందట కోల్డ్ షట్ డౌన్‌లో ఉంచారు. ఏం జరిగిందో తెలీదుగానీ.. ఆదివారం ఈ ప్లాంట్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

న్యూక్లియర్ ప్లాంట్‌లో మంటలపై రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మంట ల వెనుక రష్యా సైన్యం హస్తముందన్నది ఉక్రెయిన్ ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా కీవ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తోంది. రష్యా కూడా ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్ బలగాల వల్లే ఇదంతా జరుగుతోందని అంటోంది.


ALSO READ: హోటల్‌పై కుప్పకూలిన హెలికాప్టర్..పైలట్ దుర్మరణం

ఇదిలావుండగా జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్‌లో చెలరేగిన వ్యవహారంపై ఆ ప్రాంత గవర్నర్ రియాక్ట్ అయ్యారు. మంటలను అక్కడి విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలు పూర్తిగా ఆర్పివేసినట్టు చెప్పు కొచ్చారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్యలేదన్నది అక్కడి అధికారుల మాట. ప్రస్తుతం జరిగిన ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×