BigTV English

Namitha: ఆ నిర్మాత నన్ను నమ్మించి మోసం చేశాడు.. చివరికి..

Namitha: ఆ నిర్మాత నన్ను నమ్మించి మోసం చేశాడు.. చివరికి..

Namitha:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను బోల్తా కొట్టించడం చాలా సులువు. ఏదో ఒక మాయమాటలు చెప్పి వారిని సినిమాలకు సైన్ చూపిస్తారు. ఆ స్టార్ హీరో నటిస్తున్నాడు అని, కథలో మీరే మెయిన్ అని, ఈ సినిమా చేస్తే నెక్స్ట్ స్టార్ మీరే అని.. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మి ఒక సినిమాకు సైన్ చేస్తే అంతే సంగతులు. సినిమా ఒప్పుకున్నప్పుడు ఒకలా.. సినిమా రిలీజ్ అయ్యాకా ఇంకొకలా కనిపిస్తూ ఉంటుంది. అసలు సినిమాలో కొన్నిసార్లు ఆ క్యారెక్టర్స్ కూడా లేకుండా చేస్తారు. హీరోయిన్స్ ను నమ్మించి మోసం చేస్తారు.


నేను కూడా ఇలానే మోసపోయాను అని హాట్ బ్యూటీ నమిత చెప్పుకొచ్చింది. తెలుసునా.. తెలుసునా అంటూ సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. దిల్ దివానా అంటూ జెమిని సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో కొలువై ఉండిపోయింది. సన్నగా ఉన్న నమిత ఒక్కసారిగా బొద్దుగా మారి తమిళ్ తంబిలకు దేవతలా మారింది. ఇక అక్కడ తన సత్తాచాటింది. కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ వీరేంద్ర చౌదరిని వివాహమాడి ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారింది.

ప్రస్తుతం ఇంటికే పరిమితమయిన నమిత తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అమ్మడు తన కెరీర్ కు సంబంధించిన విషయాలతో పాటు చేదు అనుభవాలను కూడా పంచుకుంది. గతంలో తనను ఒక నిర్మాత మోసం చేశాడని నమిత చెప్పుకొచ్చింది. ధనుష్ సినిమా అని చెప్పి తన డేట్స్ తీసుకొని వేరే ఏదో సినిమాకు వర్క్ చేయించినట్లు తెలిపింది.


” సినిమా పేరు చెప్పను కానీ, హీరో ధనుష్ అని చెప్పి నా కాల్షీట్స్ తీసుకున్నారు. నేను సెట్స్ కు వెళ్ళాక తెల్సింది.. హీరో ధనుష్ కాదు.. నిర్మాత కజిన్ అని, నాకు చాలా బాధగా అనిపించింది. వెంటనే నేను సినిమా చేయను అని చెప్పి సగంలోనే షూటింగ్ నుంచి వచ్చేశాను. ఆ తరువాత ఎలాగోలా షూటింగ్ చేయించి ఆ సినిమా రిలీజ్ చేయించారు. నిర్మాత ఇలా మోసం చేసాడని నేను అప్పుడే నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేశాను” అని నమిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×