BigTV English

Nandamuri Balakrishna : తొడ కొట్టి బరిలోకి దిగిన నటసింహం.. వైరల్ అవుతున్న వీడియో..

Nandamuri Balakrishna : తొడ కొట్టి బరిలోకి దిగిన నటసింహం.. వైరల్ అవుతున్న వీడియో..
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna : నందమూరి నటసింహం తన జూలు విదిల్చి యుద్ధ రంగం లో అడుగుపెట్టబోతుంది. అది కూడా ఏకంగా ఇద్దరు హీరోలతో తలపడబోతున్నాడు బాల కృష్ణ. బాలయ్యతో తలపడుతున్న ఆ ఇద్దరు చిన్న పర్సనాలిటీలు కాదు.. కోలీవుడ్ నుంచి కిచ్చ సుధీప్, బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ లాంటి బలాఢ్యుల మధ్య బాలయ్య తొడ కొట్టి రంగంలోకి దిగుతున్నాడు. ఇదేమన్నా కొత్త మల్టీస్టారర్ మూవీ అనుకుంటున్నారేమో..కాదండోయ్.. ఇది ఒక ప్రోమో మాత్రమే.


అఖండ మూవీ తర్వాత నుంచి బాలయ్య కెరియర్ కూడా అఖండంగానే సాగుతోంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంది బాలయ్య పరిస్థితి. సినిమాలు వరుస బ్లాక్ బస్టర్ లుగా నిలబడటమే కాకుండా .. అన్ స్టాపబుల్ టాక్ షో తో బాలయ్యకు మంచి పబ్లిసిటీ వచ్చింది. మొన్న దసరా బరిలోకి దిగిన భగవంత్ కేసరి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇదే జోరు కంటిన్యూ చేస్తూ బాలయ్య తన తదుపరి చిత్రం ఎన్బీకే 109 షూటింగ్ కూడా ప్రారంభించేశాడు.

ప్రస్తుతానికి ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, త్రిష హీరోయిన్లుగా చేస్తారని టాక్. అయితే ఇంకా ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు . టాక్ షో తో పాటుగా బాలయ్య ఇప్పుడు మరొక క్రేజీ పనితో బాగా పాపులర్ అయ్యాడు. అదేమిటో కాదు..ప్రో కబడ్డి. మొన్నటి వరకు క్రికెట్ జోష్ కొనసాగింది..మరి ఇప్పుడు ప్రో కబడ్డీ సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య కబడ్డీ లీగ్ కోసం వినూత్నంగా ప్రచారం చేశాడు.


కబడ్డీ లీగ్ కు మద్దతుగా బాలకృష్ణ,కిచ్చ సుదీప్, టైగర్ ష్రాఫ్ ముందుకు వచ్చారు. ప్రో కబడ్డీ నిర్వాహకులు ఈ ముగ్గురితో వినూత్నంగా ఒక యాడ్ ని డిజైన్ చేశారు. రీసెంట్ గా ఈ యాడ్ కి సంబంధించి విడుదలైన వీడియో బాగా వైరల్ అయింది. ఇందులో హీరోలు ముగ్గురు గుర్రాల మీద యోధుల గెటప్ లో వచ్చి కబడ్డీ ఆడుతున్నారు. ఇక బాలయ్య అయితే.. ఓ రేంజ్ లో కూత పెట్టి.. తొడకొట్టి కబడ్డి ఆటలోకి దూకుతాడు.

ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన నిర్వాహకులు..కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట.. మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట.. కండల బలమే ఆయుధంగా, మైదానమే రణస్థలంగా, పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు అని పోస్ట్ పెట్టారు. ఇక ఈ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబర్ 2న మొదలు కాబోతోంది. మొత్తం 12 టీమ్స్ బరిలోకి దిగుతున్న ఈ ప్రో కబడ్డీ మ్యాచ్ ల కోసం మూడు సినీ పరిశ్రమల నుంచి హీరోలు ప్రమోషన్ యాడ్లో పాల్గొన్నారు.

.

.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×