BigTV English

Nandamuri Balakrishna: తారకరత్న ఇంటికి కొడుకుతో పాటు వెళ్లిన బాలయ్య..

Nandamuri Balakrishna: తారకరత్న ఇంటికి కొడుకుతో పాటు వెళ్లిన బాలయ్య..

Nandamuri Balakrishna: టాలీవుడ్ లో బాలకృష్ణ గురించి తెలియని వారుండదు. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ కు బాలయ్య గురించి, ఆయన కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొట్టినా బాలయ్యనే.. పెట్టినా బాలయ్యనే అనే నానుడి ఊరికే రాలేదు. కోపం లో బాలయ్య చెయ్యి చేసుకున్నా.. ప్రేమ చూపించే విషయంలో కూడా అంతకు మించే ఉంటుంది. ఇక ఇప్పుడు బాలయ్య సంగతి ఎందుకు అంటే.. నందమూరి తారకరత్న కుటుంబానికి బాలయ్య అండగా ఉండే తీరు ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. తారకరత్న, అలేఖ్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని నందమూరి కుటుంబానికి దూరమయ్యాడు.


అన్న కొడుకు అయినా కూడా తారకరత్నను బాలయ్య ఆదరించాడు. తారకరత్న ప్రచారంలో స్పృహ తప్పిపడిపోయిన దగ్గరనుంచి ఆయన మృతి చెంది కార్యం ముగిసేవరకు బాలయ్యనే ముందు ఉండి నడిపించాడు. తారకరత్న మరణించిన తరువాత ఒంటరి అయిన అలేఖ్యను వారి పిల్లల చదువు, ఇతరత్రా వ్యవహారాలన్నీ కూడా బాలయ్యనే చూసుకుంటున్నాడు. ఇక తాజాగా బాలయ్య.. అలేఖ్య ఇంటికి వెళ్లి తారకరత్న పిల్లలతో కాసేపు సరదాగా గడిపాడు. ఇక బాలయ్యతో పాటు వారసుడు మోక్షజ్ఞ కూడా కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ప్రచారంలో బిజీగా ఉంటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అసలు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తారకరత్న ఇంటికి బాలయ్య ఎందుకు వెళ్ళాడు అంటే.. అలేఖ్య సపోర్ట్ కోసమని చెప్పుకొస్తున్నారు.

అలేఖ్య ఫ్యామిలీ వేరే పార్టీలో ఉంది. తారకరత్న ఉన్నప్పుడు ఓకే కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. దీంతో బాలయ్య.. అలేఖ్య సపోర్ట్ కోసమే వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ అలేఖ్య తన మామయ్యకే సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ” అందరూ నన్ను ఎప్పుడూ.. ఎటు వైపు ఉంటానని అడుగుతున్నారు. నేను ఎప్పుడూ ప్రేమ, మానవత్వం, ముఖ్యంగా కుటుంబం వైపే ఉంటాను. బాలకృష్ణ మావయ్య మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం” అంటూ రాసుకొచ్చింది. ఇక అలేఖ్య సపోర్ట్ కూడా బాలయ్యకే దక్కింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


Related News

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×