BigTV English

Kishan Reddy: బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy: బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy Comments On BRS(Telangana politics): రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి 5 నెలలు అయినా సరే ఓటమిని ఒప్పుకోలేకపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.


కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీనే.. ఈ విషయం కేటీఆర్ కు గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన గులాబీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుమార్తె లిక్కర్ మాఫియా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు అడుగుతోంది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం అయోమయంలో ఉందన్నారు.


గ్యారంటీల పేర్లతో గారడీలు చేసి రేవంత్ రెడ్డి ఓట్లు దండుకున్నారుని ఆరోపించారు. ఇప్పుడేమో ఆగస్టు 15 కల్లా హామీలను అమలు చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు చేయనిది.. ఆ వెంటనే గ్యారెంటీలని అమలు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆగస్టు 15 తర్వాత ప్రజలకు మొండిచేయి చూపిస్తారన్నారు. ఎన్నికల కోడ్ అయిపోగానే రుణమాఫీ చేయొచ్చు కదా.. దానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించారు.

Also Read: ‘ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు’

దేశంలోనూ, రాష్ట్రంలోనూ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందువరుసలో ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించిన ఐదు సభల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ, అభ్యర్థులను ప్రకటించడంలోనూ బీజేపీ అందరికంటే ముందు ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Related News

Hyderabad Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. మునిగిన హైదరాబాద్.. హై అలర్ట్!

BRS KTR: నన్ను ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి.. నేను దేనికైనా రెడీ: కేటీఆర్

ED raids Hyderabad: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. బసరత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కేసీఆర్ ప్రకటన

KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి అస్వస్థత

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

Big Stories

×