Nandamuri Family Issues : గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. తన అన్న దివంగత నటులు హరికృష్ణ (Harikrishna) వారసులు నందమూరి ఎన్టీఆర్ (Nandamuri Junior NTR),నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) లను దూరం పెట్టాడు అని ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త ఇది. పైగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఒకవైపు.. నందమూరి, నారా ఫ్యామిలీ ఒకవైపు అన్నట్టుగానే అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. దీంతో ఈ నందమూరి హీరోలు ఎప్పుడు కలిసిపోతారు..? ఎప్పుడు ఒకే వేదికపై కనిపిస్తారు..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె’ కార్యక్రమానికి ఎంతో మంది హీరోలు వచ్చి సందడి చేశారు. ఎన్టీఆర్ కూడా వస్తారు అనుకున్నారు కానీ ఆయన రాకపోయేసరికి అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఎన్టీఆర్ నోట బాలకృష్ణ మాట..
ఇక ఇటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తమ బాబాయి బాలకృష్ణ గురించి స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి . ఇప్పుడు తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్న ఎన్టీఆర్ తన బాబాయ్ బాలకృష్ణ అంటూ స్పందించడం అభిమానులకు భారీ ఊరట కలిగిస్తోంది అని చెప్పవచ్చు. ఇంకా ఎన్టీఆర్ నోట బాలయ్య మాట.. హమ్మయ్య వీళ్ళు కలిసిపోయారని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి (Rajamouli ) దర్శకత్వం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం ఆర్. ఆర్.ఆర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు రెండు విభాగాలలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది. ఇప్పుడు ఈ సినిమాను లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ సినిమా లైవ్ కాన్సెప్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి (MM Keeravani), రాజమౌళి (SS Rajamouli) విచ్చేసి ఒకే వేదికపై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హమ్మయ్యా.. మొత్తానికి ఫ్యామిలీ అంతా కలిసిపోయారుగా..
ఇకపోతే ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్.ఆర్.ఆర్ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. రాజమౌళి టార్చర్ అంతకు మించి ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటలో నా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరింత సంతోషంగా ఉంది. ఈ సన్నివేశం ఎలా ఉందంటే.. నా ఫ్రెండ్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా మా డాన్స్ కాంబో అదిరిపోయింది” అంటూ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. ఇక లండన్ వేదికగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్లతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాదు ఈ మధ్య కళ్యాణ్ రామ్ కూడా ఓ ఈవెంట్ లో బాల బాబాయ్ అని అన్నాడు. అలాగే… మంత్రి లోకేష్ కూడా ఓ రోడ్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని అభివాదం చేశాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నోట బాలయ్య మాట పలకడంతో మొత్తానికైతే వీళ్ల ఫ్యామిలీ అంతా కలిసిపోయారు అని తెలుస్తోంది . ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ALSO READ:Allu Arjun : ఇంత బతుకు బతికి చివరికి రెస్టారెంట్ ముందు.. హవ్వా… పుష్ప రాజ్‌కు ఎంత కష్టమొచ్చింది