BigTV English

Virat kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. పోస్ట్ వైరల్

Virat kohli Retirement:  విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. పోస్ట్ వైరల్

Virat kohli Retirement:  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat kohli ) సంచలన ప్రకటన చేశారు. అందరూ ఊహించినట్లుగానే టెస్ట్ క్రికెట్ కు ( Test Cricket) రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. గత 14 సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నానని… తన వయసు నేపథ్యంలో.. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు విరాట్ కోహ్లీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి… విరాట్ కోహ్లీ ( Virat kohli Retirement) ఎమోషనల్ అయ్యారు.  14 సంవత్సరాల పాటు వైట్ జెర్సీ ధరించానని…. ఈ నేపథ్యంలో తనకు అండగా నిలిచిన వారందరికీ… ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు విరాట్ కోహ్లీ. ఈ 14 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని చెప్పవచ్చాడు. కానీ తన కెరీర్ లో చాలా సక్సెస్ అయినట్లు వివరించాడు.


Also Read: Five Penalty Runs: ఒరేయ్ సచ్చినోడా కీపింగ్ అక్కడ చేస్తారా.. కొంపముంచిన హెల్మెట్.. 5 పరుగులు బొక్క

మైదానంలో తనకు ఎంతో సపోర్ట్ గా.. అభిమానులు నిలిచారని గుర్తు చేసుకున్నాడు. నేను ఎల్లప్పుడూ నా టెస్ట్ కెరీర్ నువ్వు చిరునవ్వుతోనే తిరిగి చూస్తానంటూ పోస్ట్ పెట్టాడు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే t20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ… తాజాగా టెస్ట్ ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వన్డే క్రికెట్ మాత్రమే ఆడనున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి గుడ్ బై చెప్పకూడదని చాలామంది విరాట్ కోహ్లీని బతిలాడారు. స్టార్ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడానికి.. మొగ్గు చూపారు. ఈ మేరకు ఇవాళ పోస్ట్ పెట్టారు.


విరాట్ కోహ్లీ టెస్ట్ రికార్డులు

2011 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్లో అడుగు పెట్టాడు విరాట్ కోహ్లీ. అది కూడా వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో… టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 123 టెస్ట్ మ్యాచ్లు విరాట్ కోహ్లీ ఆడాడు. ఇందులో 30 సెంచరీలు అలాగే 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 9230 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

టెస్టుల్లో అత్యధిక స్కోర్

టెస్టు క్రికెట్ లో విరాట్ కోహ్లీ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. అది కూడా నాటౌట్. ఈ టెస్ట్ క్రికెట్లో 210 ఇన్నింగ్స్ లు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలోనే 16,608 బంతులు ఎదుర్కొని 55.57 సగటుతో తొమ్మిది వేలకు పైగా పరుగులు చేశాడు కోహ్లీ.

విరాట్ కోహ్లీ, రోహిత్ లేకుండానే టీమిండియా

రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టి20 వరల్డ్ కప్ సమయంలో టి20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకేసారి ఈ ప్రకటన చేశారు. ఇక తాజాగా రోహిత్ శర్మ కూడా టెస్టులకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ ప్రకటించిన వారం రోజులు తిరగక ముందే… కోహ్లీ కూడా ఇవాళ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. దీంతో టి20 లు అలాగే టెస్టుల్లో విరాట్ కోహ్లీ అటు రోహిత్ శర్మ లేకుండానే టీమ్ ఇండియా ఆడనుంది. వన్డేలు కూడా 2027 వరకు ఆడే చాన్సులు ఉన్నాయి.

Also Read: Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×