BigTV English

Tollywood : ఫ్యామిలీ మొత్తం స్టార్ హీరోలే.. కొత్త హీరో ఎంట్రీకి మోక్షం ఎప్పుడో..

Tollywood : ఫ్యామిలీ మొత్తం స్టార్ హీరోలే.. కొత్త హీరో ఎంట్రీకి మోక్షం ఎప్పుడో..

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు తమ కుమారులను ఇండస్ట్రీలోకి హీరోలుగా పరిచయం చేశారు. అయితే అందరూ స్టార్ హీరోలు అయ్యారంటే కాదని చెప్పాలి. కొందరు మాత్రమే తమ అదృష్టంతో వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరికొందరు హీరోలు మాత్రం ఇప్పటికీ ఒక్క హిట్ అయిన పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇండస్ట్రీలోకి కొత్త హీరోల ఎంట్రీ జరుగుతూనే ఉంటుంది. అందులో స్టార్ల ఫ్యామిలీల నుంచి వచ్చే కిడ్స్ కి కాస్త ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈమధ్య హీరోల వారసులు సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమధ్య మోక్షజ్ఞ లుక్ కూడా రివిల్ చేశారు. అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞ అని ముందుగా లాంచ్ చేస్తాడు అన్న విషయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది..


నందమూరి హీరోలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది స్టార్ రేంజ్ ను అందుకొని వరుస సినిమాలు చేసుకుంటున్నారు అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులోనూ అటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా బిజీగానే ఉన్నారు. నందమూరి సీనియర్ హీరో బాలయ్య చేతిలో సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరంతా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ కి మాత్రం ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేకపోతున్నారు. ఇండస్ట్రీలో అంత పెద్ద స్టార్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోని లాంచ్ చేసేందుకు డైరెక్టర్లు సెట్ కాలేదు. బాలయ్య డైరెక్టర్ వేటలో ఉన్నారు.


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్.. 

నందమూరి నట సింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత ఐదేళ్లుగా ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఆయన ఎంట్రీ అయితే ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఉంటుందా ఉండదా మోక్షజ్ఞ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా కావాలనే బాలయ్య బాబు అతన్ని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని చూస్తున్నాడు అనే అనేక విషయాల మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు.. ఆ మధ్య హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంచ్ చేస్తారని వార్త వినిపించింది. ఆ తర్వాత ఏమైందో కానీ తప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరు డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నట వారసులంతా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్ లను సాధిస్తూ దూసుకుపోతుంటే బాలయ్య బాబు కొడుకు మాత్రం ఇంకా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అనే దానికోసమే ఎదురు చూస్తూ ఉండడం ఫ్యాన్స్ ఊహించలేకున్నారు. మరి మోక్షజ్ఞ ఎప్పుడూ వస్తాడు సినిమా ఎప్పుడు చేస్తాడు, ఇండస్ట్రీ హిట్ ఎప్పుడు కొడతాడు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×