BigTV English

Mega DSC: గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్

Mega DSC: గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్

⦿ మెగా డీఎస్సీపై దృష్టిపెట్టిన కూటమి సర్కార్
⦿ 16,347 పోస్టులకు నోటిఫికేషన్
⦿ ఎన్నికల హామీలపై నజర్
⦿ మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం
⦿ వచ్చే విద్య సంవత్సరానికి పోస్టింగులు
⦿ న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్వహణ
⦿ రిజర్వేషన్ల రోస్టర్ ప్రకారమే నియామకాలు


అమరావతి, స్వేచ్ఛ:

Mega DSC: ఏపీలో ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా కూటమి సర్కార్ వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్, ఇసుక, అన్న క్యాంటీన్ల విషయంలో ప్రజాదరణ పొందుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే పెట్టారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం అని ప్రచారం చేశారు. పైగా బాబు వస్తే జాబు గ్యారెంటీ అనే ప్రచారం బాగా పాపులర్ అయింది. ఆ నినాదంతోనే కూటమి సర్కార్ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించారు. మెగా డీఎస్సీ కి నోటిఫికేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమయింది.


16,347 పోస్టింగులు

నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. 16 వేల మూడువందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ ప్రక్రియ నుంచి పరీక్షల నిర్వహణ, పోస్టింగుల ప్రక్రియ ఇవన్నీ కలిసి దాదాపు నాలుగు నెలల పరిధిలోగా మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: ఈ శతాబ్దపు జోక్.. జగన్ బెయిల్ రద్దు అంశంపై స్పందించిన షర్మిల

వచ్చే విద్య సంవత్సరానికి..

2025-26 సంవత్సరానికి గాను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేసి..విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ మెగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టునున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలు, మండలాలవారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించి మొత్తం ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో ప్రభుత్వానికి నివేదిక అందించింది విద్యాశాఖ. సంబంధిత పోస్టులకు రిజర్వేషన్లు ఎలా అమలుచేయాలి..న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా సవ్యంగా మెగా డీఎస్సీని నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేశారు. టెట్ పరీక్ష ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైనల్ కీ విడుదలయింది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×