BigTV English
Advertisement

Nani – Hit 3: రైటర్‌గా మారిన నాని.. ‘హిట్ 3’లో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..!

Nani – Hit 3: రైటర్‌గా మారిన నాని.. ‘హిట్ 3’లో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..!

Nani – Hit 3: నేచురల్ స్టార్ నాని కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలా ఛాన్స్ ఇచ్చి గతేడాది వరుసగా రెండు సినిమాలతో హిట్లు అందుకున్నాడు. అందులో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తన కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమా కూడా ‘దసరా’నే కావడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత అదే జోష్‌లో మరో కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో ‘హాయ్ నాన్న’ సినిమా తీశాడు.


ఈ సినిమా కూడా మంచి హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా కొత్త దర్శకులకు ఛాన్స్‌లు ఇచ్చి మంచి హిట్లు అందుకుంటున్నాడు. అయితే నాని ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు అతడు రైటర్‌గా కూడా మారినట్లు తెలుస్తోంది. నాని ఓ సినిమాకి స్టోరీ లైన్ ఇచ్చారని తెలుస్తోంది. అదే ‘హిట్3’. దీంతో నాని ఇచ్చిన ఆ స్టోరీ లైన్‌తోనే డెవలప్ చేసి శైలేష్ కొలను స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 12 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. చూడదగ్గవి ఏవంటే..?


కాగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’లో విశ్వక్ సేన్ నటించి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘హిట్ 2’లో అడివి శేష్‌ని పెట్టి తెరకెక్కించి మరింత హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హిట్ 3లో నాని హీరోగా నటిస్తున్నాడు. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నటించబోతున్నాడు. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం నాని చిన్న స్టోరీ లైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని దర్శకుడు డెవలప్ చేసి స్క్రిప్ట్ రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో కమ్ నిర్మాత రానా దగ్గుబాటి ఈ మూవీలో విలన్ పాత్ర చేయబోతన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ హిట్ 3 మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×