BigTV English

Nani 32 Movie: నా నెక్స్ట్ సినిమాకి పిల్లలు దూరంగా ఉండాలి: నాని

Nani 32 Movie: నా నెక్స్ట్ సినిమాకి పిల్లలు దూరంగా ఉండాలి: నాని

Nani 32 Movie: నాచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సరిపోదా శనివారం’ పాజిటివ్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతుండగానే తన తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పిన మాటలు మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచేసింది. ఇంటర్వ్యూలో.. దసరా చిత్రంలో తలలు నరికే సన్నివేశాలు ఉన్నందున పిల్లలను సినిమాకి తీసుకెళ్లవచ్చా అని ఆలోచించా. సరిపోదా శనివారం సినిమాకు అలాంటి సమస్యే లేదు. ఇందులో హింస ఉంది. కానీ, అది అందరూ చూసేలా ఉంటుంది. కానీ, నా తర్వాత చిత్రానికి మాత్రం పిల్లలు దూరంగా ఉండాలి. వాళ్లకు నో ఎంట్రీ అన్నట్లుగా.. చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.


సస్పెన్స్‌తో కూడిన పోస్టర్..
దీంతో నాని నెక్ట్స్ సినిమా ఏంటా? అని నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకి నాని నెక్ట్స్ సినిమా శ్రీకాంత్‌ ఓదెలతోనా? లేదా శైలేష్‌ కొలనుతోనా? అంటూ మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగానే నాని సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశాడు. రక్తంతో నిండిన చేతితో కారు డ్రైవ్ చేస్తున్న పోస్టర్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Also Read: వరద బాధితుల కోసం రూ.కోటి విరాళమిచ్చిన బాలయ్య!


నాని 32వ మూవీ ఏది?
నాని తన 32వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 5న ఉదయం 11.04 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా వెల్లడించాడు. పోస్టర్‌కు డైలాగ్ క్యాప్షన్‌గా హిందీలో ‘హా..తో..’ అని ఉంది. దీంతో ఈ పోస్టర్ ఇది ‘హిట్’ మూవీస్ సంబంధించినదేనని, ఈ మూవీలో నాని పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని, దసరాను మించిన వయొలెన్స్‌ ఈ మూవీలో ఉండబోతుందని, అందుకే పిల్లలకు కూడా నో ఎంట్రీ అన్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడనే టాక్ నడుస్తుంది. మరి నాని 32వ మూవీ నిజంగానే ‘హిట్-3’నా? లేక వేరే సినిమానా? అనేది సెప్టెంబర్ 5న తేలిపోనుంది.

చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండలను వెనక్కి నెట్టిన నాని
ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్‌ను రాబడుతోంది. కేవలం అమెరికాలోనే 1.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ సార్లు ఈ మార్కును సాధించిన హీరోల లిస్టులో చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండలను వెనక్కి నెట్టి నాని 4వ స్థానానికి చేరాడు. ఈ లిస్టులో మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ 3లో ఉన్నారు. మరి నాని తర్వాత సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో.. ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×