Nani Controversial Comments on Jersey Sequel: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోల్లో నాని ఒకడు. సెల్ఫ్ మేడ్ స్టార్ కి ఈ జనరేషన్ లో అర్ధం చెప్పింది అయితే నాని అనే చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి .. హీరోగా మారి.. మంచి మంచి కథలను ఎంచుకొని న్యాచురల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో కొలువుండిపోయాడు. అయితే నాని మాటతీరు చాలా సమయాల్లో కాస్త కఠినంగా ఉంటుంది. కావాలని అంటాడో.. అనుకోకుండా అంటాడో తెలియదు కానీ, కొన్నిసార్లు మాటలు వదిలేసి వివాదాల్లో చిక్కుకుంటాడు.
తాజాగా అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇక నాని కనిపించడంతో అభిమానులు గోల గోల చేశారు. జెర్సీ 2 ఎప్పుడు అని ఒక అభిమాని అడిగేశాడు కూడా.. ఇక దానికి నాని.. ” నేను లేనుగా.. ఎవరితో చేసుకుంటారో చేసుకోండి” అని అనేశాడు. ప్రస్తుతం ఈ మాట నెట్టింట వైరల్ గా మారింది. నానిపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. నానికి పొగరు అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంత పొగరు.. ఎవరితో చేసుకుంటారో చేసుకోండి ఏంటి.. నువ్వు కాకపోతే ఎవరితో చేయలేరు అనేనా.. అది కాన్ఫిడెంట్ గా చెప్పినట్లు లేదు పొగరుతో చెప్పినట్లు ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే నాని వేరే అర్థంలో ఆ మాట అన్నట్లు తెలుస్తోంది. జెర్సీలో నాని పాత్ర అర్జున్ చనిపోతాడు. పోనీ కొడుకుగా నటించడానికి అయినా చివర్లో పెద్దయిన కొడుకుగా హీరో హరీష్ కళ్యాణ్ ను చూపించారు. అందుకే నాని.. నేను లేనుగా.. ఇక ఆ సీక్వెల్ తో నాకు సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు. దాన్ని కొంతమంది వేరేవిధంగా అర్ధం చేసుకొని ఉండొచ్చు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ ఆమెకు కడుపు చేసి వదిలేశాడు.. మళ్లీ పాత పాట మొదలెట్టిన పోసాని
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో జెర్సీ ఒకటి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా నాని కెరీర్ నే మార్చేసింది. న్యాచురల్ అనే ట్యాగ్ లైన్ కు నాని జస్టిఫికేషన్ ఇచ్చిన సినిమా జెర్సీ. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే అర్జున్ పాత్రలో నానిని తప్ప వేరొకరిని ఊహించలేం. అందుకు ఉదాహరణ.. హిందీలో ఈ సినిమా రీమేక్ చేస్తే అక్కడ ప్లాప్ టాక్ ను అందుకుంది. మరి నాని ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నాడో ఆయనకే తెలియాలి.