BigTV English

Earthquake in Taiwan: తైవాన్‌ను వణికించిన భూప్రకంపనలు.. 9 నిమిషాల వ్య‌వ‌ధిలో ఐదుసార్లు!

Earthquake in Taiwan: తైవాన్‌ను వణికించిన భూప్రకంపనలు.. 9 నిమిషాల వ్య‌వ‌ధిలో ఐదుసార్లు!

Earthquake in Taiwan: ప్రశాంతంగా ఉన్న తైవాన్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తూర్పు తైవాన్ హులిన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్ షిప్లో సోమవారం సాయంత్రం నిమిషాల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో ఐదుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.


కేవలం 9 నిమిషాల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. ఈ వరుస ప్రకంపనలతో ప్రజలు ఇళ్లనుంచి భయటకు పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం అక్కడ కాలమానం ప్రకారం 5.08 గంటల నుంచి 5.17 గంటల మధ్య వరుస భూ ప్రకంపనలు సంభవించినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది.

తైపీ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషషన్ కు సంబంధించిన సిస్మోలజీ సెంటర్ తూర్పు కౌటీ హులిన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. భూమికి 10 కిలోమీటర్లు లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. దీంతో తైపీలో పలు భవనాలు నేలకొరిగాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని.. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది.


Also Read: ట్రాక్ పై నుంచి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి

అయితే రెండు వారాల కిందట తూర్పు తైవాన్ లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా 14 మంది మరణించగా దాదాపు 700 మందికి పైగా గాయాలపాయ్యారు. భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్లు తైవాన్ అధికారులు వెల్లడించారు.

కాగా, ఏప్రిల్ 3న సంభంవించిన ఆ భూకంపం కారణంగా హులిన్ సిటీలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కౌంటీలో దాదాపు 130 మందికి పైగా గాయలపాలయ్యారు. దీంతో రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో వరుస ప్రకంపనలు రావడంతో ప్రజలు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×