BigTV English

Nelson Dilip Kumar: దీపావళికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాని లేపుతున్నాడు

Nelson Dilip Kumar: దీపావళికి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాని లేపుతున్నాడు

Nelson Dilip Kumar: డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొలమావు కోకిల సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. అయితే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో యోగి బాబుని చూపించిన విధానం. నయనతార (Nayanathara) ను చూపించిన విధానం. ఆ కథ, స్క్రీన్ ప్లే, ఆ టైప్ ఆఫ్ కామెడీ ఇవన్నీ కూడా అప్పటి ప్రేక్షకులకి మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. ఇదే సినిమాను తెలుగులో కూడా కోకో కోకిల అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన సినిమా వరుణ్ డాక్టర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన విజయాన్ని సాధించింది. అసలు కామెడీని ఇలా కూడా చేయొచ్చు. అని తన పంథాలో కామెడీని చూపించి ఆ సినిమాను దాదాపు 100 కోట్లు మార్కు అందుకునేలా హిట్ చేశాడు నెల్సన్. అప్పటితో నెల్సన్ పైన అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.ఇదే సినిమా తెలుగులో కూడా బీభత్సమైన విజయాన్ని సాధించింది.


జైలర్ సినిమాతో కం బ్యాక్

నెల్సన్ చేసిన 3వ సినిమా బీస్ట్. అప్పటికే వరుణ్ డాక్టర్ (Varun Doctor) అనే సినిమా మంచి హిట్ అవ్వటం. ఇళయ దళపతి విజయ్ (Vijay) లాంటి స్టార్ హీరోతో నెల్సన్ సినిమా చేస్తుండడంతో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా బీస్ట్ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అక్కడితో నెల్సన్ పని అయిపోయింది అనుకున్నరంతా. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్ (Jailer) అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. నెల్సన్ జైలర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. అయితే జైలర్ లో రజనీకాంత్ ను నెల్సన్ చూపించిన విధానం. ఆ స్టైల్ ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.


దీపావళి సినిమాలను లేపుతున్నాడు

మామూలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కంటే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్నాయి మంచి యూనిటీ ఉంటుందని చెప్పాలి. అందరూ కూడా ఒక సినిమా కోసం ఒకరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇక దీపావళి సందర్భంగా మొత్తం మూడు సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. దీంట్లో శివ కార్తికేయన్ నటిస్తున్న అమరన్(Amaran), జయం రవి(Jayam Ravi) నటిస్తున్న బ్రదర్(Brother) సినిమా తో పాటు బ్లడీ బెగ్గర్(Bloody Begger) సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలకు సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ కూడా తనకు బాగా పరిచయమని ఈ మూడు సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పుకొచ్చాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×