BigTV English

NANI: నానితో ‘బలగం’ వేణు నెక్స్ట్ మూవీ.. సినిమా ఈ జానర్‌లోనే ఉంటుందట..?

NANI: నానితో ‘బలగం’ వేణు నెక్స్ట్ మూవీ.. సినిమా ఈ జానర్‌లోనే ఉంటుందట..?

NANI: టాలెంటెడ్ హీరో నేచురల్ స్టార్ నాని కొత్త కొత్త కథలతో.. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే హాయ్ నాన్న మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మరో హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ‘‘సరిపోదా శనివారం’ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.


ఈ మూవీ తర్వాత నాని మరో దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్, ‘బలగం’ డైరెక్టర్ వేణుతో నాని నెక్స్ట్ సినిమా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి వేణు.. నానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చర్చల్లో ఫైనల్ నేరేషన్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఈ స్టోరీకి ఇంప్రెస్ అయిన నాని.. వెంటనే ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఏ జానర్‌లో ఉండబోతోంది అన్న విషయం రివీల్ అయింది.

ఈ మూవీ తెలంగాణ పల్లెటూరులో జరిగే పీరియాడిక్ లవ్ స్టోరీ అని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి.. అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నాని ఇలాంటి పీరియాడిక్ లవ్ స్టోరీలో నటించడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్‌తో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీతో వచ్చిన విషయం తెలిసిందే.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×