BigTV English

HIT 3 Collections : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న హిట్ 3.. 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లేనా..?

HIT 3 Collections : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న హిట్ 3.. 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లేనా..?

HIT 3 Collections : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో లేటెస్ట్ చిత్రం హిట్ 3.. టాలీవుడ్‌కు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లు అందిస్తున్న వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాత ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు..శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, కోమలి ప్రసాద్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటించారు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. సినిమా నుంచి విడుదలైన వరుస అప్డేట్స్ తో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ మే డే సందర్భంగా మొన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన హిట్ 3 మూవీ మొదటి షో నుంచి బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలెట్టింది. ఫస్ట్ డే ఏకంగా 43 కోట్లకు పైగా వసూల్ చేసింది. మరి రెండు రోజులకు ఎంత వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


హిట్ 3 మూవీ కలెక్షన్స్..

హిట్ మూవీతో డైరెక్టర్ శైలేష్ కొలను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హిట్ సినిమాలో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ విశ్వక్ సేన్ నటించాడు. ఆ సినిమా భారీ విషయాన్ని అందుకుంది. ఆ మూవీకి సీక్వెల్ గా హిట్ 2 మూవీ వచ్చింది. రెండో పార్ట్ కూడా సక్సెస్ఫుల్ అవడంతో డైరెక్టర్ శైలేష్ మూడో పార్ట్ పై ఫోకస్ పెట్టాడు. నాని హీరోగా హిట్ 3 సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది.. మొదటి రోజునే 43 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరులో కొనసాగించిందని తెలుస్తుంది. రెండో రోజు 62 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..


Also Read : వెంకీ మామ కోసం ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు వెయిటింగ్… మరి ఏం చేస్తాడో..

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.. మూవీ నుంచి బయటికి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగింది. హిట్ 3’ సినిమాకు రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే ఈ సినిమా రూ.20.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.38.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.28.83 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. అదే విధంగా కలెక్షన్స్ రావడం విశేషం. ఇక ఇదే జోరునా కలెక్షన్స్ రాబడితే ఈ వీకెండ్ లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నాని ఖాతాలో మరో హిట్ పడిపోయింది. ఇక నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ మూవీ త్వరలోనే విడుదల కాబోతుందని సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×