Techie Attacks Tenant| ఒక వివాహితుడు అయిన ఇంటి ఓనర తన ఇంట్లో నివసించే అద్దెకు నివసించే యువతిని వేధించాడు. ఇంట్లో భార్య ఉన్నా.. ఆ యువతిని కామంతో చూశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకపోవడంతో అతని ఇల్లు ఖాళీ చేసింది. అయినా ఆ ఇంటిఓనర్ ఆమెను వెంబడించాడు. ఆమె మరో యువకుడిని ప్రేమిస్తోందని తెలిసి వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని కమలానగర్ ప్రాంతంలో 41 ఏళ్ల యువకుడు శ్రీకాంత్ నివసిస్తున్నాడు. అతనికి పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. కమలానగర్ లో సొంత ఇల్లు కలిగిన శ్రీకాంత్ తన ఇంట్లో పై పోర్షన్ అద్దెకు ఇచ్చాడు. 2023లో శ్రీకాంత్ ఇంట్లో అద్దెకు ఉండేందుకు ఇలియానా (పేరు మార్చబడినది) అనే 21 ఏళ్ల యువతి వచ్చింది. ఆమె అందంగా ఉండడంతో వివాహితుడైన శ్రీకాంత్ ఆమె పై మనసుపడ్డాడు. నగరంలో అందరూ ఫ్రెండ్లీగా ఉండడం సహజం. అలాంటిది శ్రీ కాంత్ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇలియానాతో సన్నిహితంగా ఉండేవాడు. ఇంట్లో భార్య ఉన్నా తరుచూ ఆమె ఇంటికి కబుర్లు చెప్పేవాడు. క్రమంగా అతని స్నేహం కాస్త ఇలియానాకు ఇబ్బందిగా మారింది.
శ్రీ కాంత్ అప్పుడప్పుడూ ఆమె ఇంట్లో బెడ్ రూమ్ వరకూ వచ్చేసేవాడు. మొహమాటం కొద్దీ ఇలియానా ఏమీ చెప్పలేకపోయేది. ఒకరోజు తన భార్య ఇంట్లో లేనప్పుడు శ్రీకాంత్.. ఒంటరిగా నివసిస్తున్న ఇలియానా ఇంటికి వెళ్లి తనతో డిన్నర్ చేయాలని ఆహ్వానించాడు. ఆ పిలుపుని ఇలియానా నిరాకరించలేక పోయింది. ఏదో ఫ్రెండ్లీగా పిలిచాడు కదా.. అని వెళ్లింది. అదే ఆమె చేసిన తప్పుగా మారింది. అతని ఇంటికి వెళ్లి డిన్నర్ చేసిన తరువాత శ్రీకాంత్ ఆమెను ప్రపోజ్ చేశాడు. తాను ఆమెను ప్రేమిస్తున్నానని.. ఆమె లేకుండా ఉండలేనని చెప్పాడు. కానీ ఇలియానా మాత్రం ఇదంతా తప్పు.. ఇంట్లో భార్య ఉన్నా మరో మహిళను కాంక్షించడం కరెక్ట్ కాదని చెప్పి వెళ్లిపోతుండగా.. ఇలియానాను శ్రీ కాంత్ బలవంతం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఇలియానా మాత్రం అతడి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయింది.
Also Read: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?
మరుసటి రోజు శ్రీ కాంత్ భార్యకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. అయితే అప్పటికే శ్రీ కాంత్ తన భార్యకు అబద్ధాలు చెప్పాడు. రివర్స్ లో ఇలియానా తనపై మనసుపడిందని ఆమెను నమ్మించాడు. దీంతో శ్రీ కాంత్ భార్య తన భర్త ఏ తప్పూ చేయలేదని.. పైగా ఆమెను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పింది. ఇదంతా విని ఇలియానా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ పోలిసులు శ్రీ కాంత్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఆ తరువాత కూడా శ్రీ కాంత్ మారలేదు. పలు మార్లు ఇలియానాను వెంబడించి తన కోరికలు తీర్చమని వేధించాడు. ఇక ఇదంతా భరించలేని ఇలియానా అతడి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది.
అయినా ఇలియానా ఎక్కడ ఉద్యోగం చేస్తోంది, ఆమె ఎక్కడ నివసిస్తోందో శ్రీ కాంత్ తెలుసుకున్నాడు. అప్పుడప్పుడూ ఆమె వెంటపడి వేధించేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఇలియానా తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయట చైనీస్ ఫుడ్ తింటుండగా.. శ్రీ కాంత్ అక్కడికి చేరుకున్నాడు. వారిని వెంబడించి ఒక నిర్మానుష ప్రాంతంలో వారిని అడ్డుకున్నాడు. తనను కాదని మరో యువకుడిని ప్రేమించడం ఏంటని ఇలియానాను నిలదీశాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శ్రీ కాంత్ తన జేబులో నుంచి పేపర్ కట్టర్ కత్తి తీసి ఇలియానా, ఆమె బాయ్ ఫ్రెండ్ పై దాడి చేశాడు. వారిని చంపేయాలనేది అతని ఉద్దేశం. కానీ అక్కడికి అనుకోకుండా ఎవరో రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత ఇలియానా, ఆమె ప్రేమికుడు బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సారి పోలీసులు కేసు నమోదు చేసి శ్రీ కాంత్ ను అరెస్ట్ చేశారు.