BigTV English

Venkatesh: వెంకీ మామ కోసం ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు వెయిటింగ్… మరి ఏం చేస్తాడో..

Venkatesh: వెంకీ మామ కోసం ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు వెయిటింగ్… మరి ఏం చేస్తాడో..

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు.. ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న నటుడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రూ. 300 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయడంతో వెంకటేష్ తదుపరి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా చేస్తాడని టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వెంకటేష్ డేట్స్ కోసం ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు లైన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


వెంకీ మామ కోసం క్రేజీ డైరెక్టర్స్..

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి రైటర్ గా తన కెరియర్ ను ప్రారంభించినప్పటికి ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ.. ఇప్పటికే టాలీవుడ్ లో అదే క్రేజ్ తో డైరెక్టర్గా కొనసాగుతున్నారు.. త్రివిక్రమ్ చివరగా మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేశాడు. అయితే ఈ మూవీ అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. కానీ కలెక్షన్స్ పరంగా దులిపేసింది. ఈ మూవీ తర్వాత బన్నీతో మూవీ చేయాల్సి ఉంది. అయితే స్టోరీలో కొన్ని మార్పుల వల్ల ఆ ప్రాజెక్ట్ మీకు బన్నీ పక్కన పెట్టాడు. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. దాంతో త్రివిక్రమ్ కూడా వేరే ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేసేందుకు స్టోరీని రాస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ ప్రాజెక్టు పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..


Also Read :కృష్ణం రాజుకు ‘రెబల్’ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలుసా..?

అటు మరో డైరెక్టర్ వెంకటేష్ తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ వార్తలు.. రీసెంట్ గా హీరో నానితో యాక్షన్ మూవీ హిట్ 3 చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మేడే సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. మొదటి రోజే ఏకంగా 43 కోట్ల రూపాయలను వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఇదే జోరులో మరికొన్ని రోజుల కొనసాగితే 500 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని నాని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. వెంకీ కోసం ఓ మాస్ మసాలా సినిమాని తియ్యాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ డైరెక్టర్ ఇద్దరు వెంకటేష్ కు కథ వినిపించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. మరి వెంకటేష్ వీరిద్దరిలో ఏ సినిమాకి ఓకే చేస్తారో చూడాలి..

గత కొన్ని లుగా సరైన హిట్ సినిమాలే నీ వెంకటేష్ కు ఏడాది సంక్రాంతికి వస్తున్నా మూవీ తో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టోరీ సెలక్షన్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. ఇకపోతే వెంకటేష్ సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×