Hanuman Jayanthi Violence| హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రెండు వర్గాలు హింసకు పాల్పడ్డాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణగా మారి అల్లర్ల రూపం దాల్చింది. రెండు భిన్న మతాలకు చెందని వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, రాళ్లదాడి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం చోటుచేసుకోలేదు. హనుమాన్ రథయాత్ర ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే ఈ సంఘటన విషాదకరం.
ఇండియా టుడే కథనం ప్రకారం.. శనివారం రాత్రి గునా జిల్లాలో బిజేపీ కౌన్సిలర్ ఓం ప్రకాశ్ కుశ్ వాహ నేతృత్వంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటలకు శోభాయాత్ర ఒక మసీదు మీదుగా వెళ్లింది. సరిగా మసీదు ముందు శోభాయాత్ర ఆగింది. అక్కడ జోరుడా డిజె సౌండుతో హనుమ భజనలు జరిగాయి. దీంతో మసీదు లోపలి నుంచి కొందరు ముస్లింలు వచ్చి.. లోపల నమాజు సమయం అని డిజె సౌండు తగ్గించాలని లేదా ముందు సాగిపోవాలని చెప్పారు. కానీ అందుకు హనుమ భక్తులు అంగీకరించపోవడంతో వాగ్వాదం జరిగింది. చూస్తుండగానే అక్కడ ముస్లింలు కూడా భారీ సంఖ్యలో గుమిగూడారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే రాళ్లు ముందుగా మసీదు వద్ద ఉన్నవారు విసిరారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సిసిటీవి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఒక వ్యక్తి అయితే చేతిలో కత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు. ఘర్షణ జరుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హనుమాన్ శోభాయాత్రను ఆ ప్రాంతం నుంచి తరలించేశారు.
Also Read: డ్రైనేజీలో మహిళ శవం.. ముక్కు పుడక ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు
ఇప్పటివరకు ఈ ఘర్షణలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. పరిస్థితి అదుపులో ఉందని, శాంతి భద్రతల సమస్యలు తలెత్త కుండా మరో 24 గంటల మసీదు పరిసరాల్లో పోలీసులు బందీబస్తు చేశారు.
ఈ ఘటనపై మసీదు ఇమాం ఆతిష్ మాట్లాడుతూ..”వారు డిజె సౌండును చాలా బిగ్గరగా వాయించారు. మసీదులో ప్రార్థనలు జరిగే వేళ కావడంతో సౌండు తగ్గించాలని కోరాము. కానీ వారు నిర్లక్ష్యం చేశారు. ఈ కారణంగా గొడవ జరిగింది. ముందుగా వారు మసీదుపై రాళ్లు విసిరారు. సమాధానంగా మసీదులోని విరిగిన టైల్స్ ని మసీదులోని ముస్లింలు విసిరారు. కానీ పోలీసులు మాత్రం ముస్లింలను మాత్రమే అరెస్ట చేయడం అన్యాయం. తప్పు ఎవరిదో విచారణ చేసి శిక్షించాలి” అని అన్నారు.