Manchu Family..మంచు వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Lakshmi) సడన్గా స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా తన తమ్ముడు మంచు మనోజ్ (Manchu Manoj) ను చూసిన వెంటనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో మంచు లక్ష్మి ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె హోస్గా కూడా వ్యవహరించారు. ఈ ఫ్యాషన్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో.. మంచు మనోజ్ దంపతులు తన అక్కను కలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వెనుక నుంచి తన అక్క మంచు లక్ష్మిని పిలువగా.. వెంటనే మంచు లక్ష్మి తమ్ముడు మనోజ్ ను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. మనోజ్ తన అక్కను ఓదార్చే ప్రయత్నం చేయగా.. మనోజ్ వెంట వచ్చిన ఆయన భార్య మౌనిక (Mounika) కూడా మంచు లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముదురుతున్న మంచు ఫ్యామిలీ గొడవలు..
గత ఏడాదికాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆస్తి తగాదాలు అంటూ మోహన్ బాబు (Mohanbabu) కామెంట్లు చేస్తుంటే.. ఇది ఆస్తి గొడవలు కాదు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’లో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే తనపై ఇలా దాడి చేస్తున్నారు అంటూ మంచు మనోజ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఈ గొడవలు ఏకంగా పోలీస్ స్టేషన్ వరకే కాదు ఏకంగా కోర్టు వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇలా రోజు రోజుకి మంచు ఫ్యామిలీలో గొడవలు ముదురుతుంటే.. అటు సోషల్ మీడియాలో కూడా పలు రకాల కామెంట్లు, థంబ్ నెయిల్స్ పెట్టి మరి వీరి పరువును మరింత దిగజార్చారని చెప్పవచ్చు.
also read:SSMB 29 Update: రాజమౌళి- మహేష్ మూవీ నుండి బిగ్ అప్డేట్.. జక్కన్నకు సాయంగా మరో స్టార్ డైరెక్టర్..?
మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మంచు మనోజ్..
ఇదిలా ఉండగా మరోవైపు రెండు రోజుల క్రితం మంచు మనోజ్ మళ్ళీ తన తండ్రి మోహన్ బాబు ఇంటిముందు బైఠాయించిన విషయం తెలిసిందే. ఇక దీంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయని, ఈ కుటుంబం పై పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ సమస్యలు రోజురోజుకీ ఎక్కువవుతున్న నేపథ్యంలో గతంలో ప్లీజ్ దయచేసి ఆపండి అంటూ మంచు లక్ష్మి వేడుకున్నా.. ఎవరు స్పందించలేదు. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ ఇలాంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తమ్ముడిని చూసి ఎమోషనల్ అయిపోయింది మంచు లక్ష్మి . ఏది ఏమైనా ఇలాంటి సందర్భాలు అటు చూసే ఆడియన్స్ కి కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నాయని చెప్పవచ్చు.
మనోజ్ ను చూసి ఏడ్చేసిన మంచు లక్ష్మి.. – #manchuLakshmi #emotional #ManchuManoj #BIGTVCinema @LakshmiManchu @HeroManoj1 pic.twitter.com/Dq7QU2JcYx
— BIG TV Cinema (@BigtvCinema) April 13, 2025