Hit 3 trailer review : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సాయికుమార్ నటించిన పోలీస్ స్టోరీ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో చాలామంది స్టార్ హీరోస్ పోలీస్ పాత్రలలో కనిపించారు. సీనియర్ స్టార్ హీరోస్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ వరకు అందరూ పవర్ఫుల్ కాప్ రోల్ లో కనిపించారు. వీటన్నిటిని మించి ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో రవితేజ నటించిన విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి.
ఫస్ట్ టైం కాప్ రోల్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకు కాప్ రోల్ చేయలేదు అయితే మొదటిసారి శైలేష్ కొలను దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు నాని. హిట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శైలేష్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత చేసిన హిట్ 2 కూడా మంచి హిట్ అయింది దీనిలో అడవిశేష్ హీరోగా కనిపించాడు. ఇక హిట్ 2 క్లైమాక్స్ లో నాని ని చూపించాడు దర్శకుడు. ఇప్పుడు హిట్ 3 సినిమాతో నాని ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా అధికారికంగా విడుదల చేశారు.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ను కాపీ కొట్టిన కోలీవుడ్ స్టార్… రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయాడుగా…
ట్రైలర్ టాక్
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఇప్పటివరకు క్లాస్ సినిమాలు చేసిన నాని మొదటిసారి పోలీస్ పాత్రలో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు.మూడు నిమిషాల 31 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మంచి ఆసక్తిని రేకిస్తుంది. “క్రిమినల్స్ ఉంటే టెన్ ఫీట్ సెల్ లో ఉండాలి, లేదా భూములో సిక్స్ ఫీట్ హోల్ లో ఉండాలి” అని నాని చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. “జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్” అనే డైలాగ్ నాని క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తుంది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు బీభత్సమైన యాక్షన్ ఉంటుంది అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా శైలేష్ ను అలాగే నానీను నెక్స్ట్ లెవెల్ కి ఈ సినిమా తీసుకెళ్లబోతుంది అని చెప్పొచ్చు.చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో ఎలివేషన్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుంది. శైలేష్ కొలను ఈ సినిమాను చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు అని చెప్పొచ్చు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే మాత్రం సైంధవ్ సినిమాతో కోల్పోయిన సక్సెస్ ను మళ్ళీ హిట్ 3 సినిమాతో శైలేష్ కొలను సాధిస్తాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు.