Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే సినిమాలు తగ్గించేశారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటేనే ఒక పండుగలా ఉండేది. రోడ్డుపైన ట్రాఫిక్ జామ్ లు ఏర్పడేవి. ఒకప్పుడు యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్ ఉండేది. ఇప్పటికీ ఆ క్రేజ్ అలానే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమందిలో నిరాశ మాత్రం ఉంది అనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వరుసగా బ్లాక్బస్టర్ హిట్ సినిమాలు పడ్డాయి. కేవలం నటుడిగానే కాకుండా అన్ని అంశాల్లోనూ పవన్ కళ్యాణ్ కి కొద్దిపాటి ప్రతిభ ఉండేది. ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకుడిగా జానీ సినిమాని చేశాడు. ఆ సినిమా ఇప్పుడు చూస్తున్నప్పుడు బాగానే అనిపించినా కూడా అప్పట్లో మాత్రం భారీ డిజాస్టర్ గా మారిపోయింది.
జానీ తర్వాత పదేళ్లు
జానీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ను నిరాశ పరుస్తూనే వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా మంచి పేరును సాధించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాగుంటుంది అని హరీష్ శంకర్ అడిగారట. అయితే సినిమా హిట్ అయింది కదా అది అందరికీ తెలుసు కదా దాని గురించి మళ్లీ మనం ఎందుకు చెప్పడం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం. అలానే సక్సెస్ వచ్చింది ఇప్పుడే జాగ్రత్తగా ఉండు సక్సెస్ ని తలకెక్కించుకోకు. అని పవన్ కళ్యాణ్ తనతో చెప్పారు అని హరీష్ శంకర్ పలు సందర్భాలలో బహిరంగంగా చెబుతూ వచ్చారు.
కాపీ కొట్టిన కోలీవుడ్ స్టార్
కోలీవుడ్లో అజిత్ కి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి అభిమానులు అజిత్ కు ఉన్నారు. ఇక రీసెంట్ గా అజిత్ నటించిన సినిమా గుడ్ బాడ్ అగ్లీ. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రి మూవీ మేకర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాకి అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈ తరుణంలో అజిత్ గారు తనకు ఒక మాట చెప్పారు అంటూ స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి చెప్పిన మాటలనే దర్శకుడు అధిక రవిచంద్రన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరీష్ శంకర్ కూడా ఈ వీడియోపై ట్విట్టర్ లో స్పందించారు.
Also Read : Hero Nithin: దర్శకుడు వశిష్టకు నితిన్ హ్యాండ్ ఇచ్చాడా.?