BigTV English

Chiru – Odela: చిరు- శ్రీకాంత్ కాంబోపై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన నాని.. గూస్ బంప్స్ గ్యారంటీ..!

Chiru – Odela: చిరు- శ్రీకాంత్ కాంబోపై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన నాని.. గూస్ బంప్స్ గ్యారంటీ..!

Chiru – Odela:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassistha mallidi) తో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్డేట్లు వచ్చాయి.అయితే విశ్వంభర (Vishwambhara) మూవీ తర్వాత చిరంజీవి.. శ్రీకాంత్ ఓదెల (Srikanth odala) డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారని ,ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే తాజాగా శ్రీకాంత్ ఓదెల – చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు నాని. మరి ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రాబోతోంది.. ? నాని ఏం చెప్పారు? అనేది ఇప్పుడు చూద్దాం..


చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల మూవీ పై అప్డేట్ వదిలిన నాని..

నాని ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాణ రంగంలో కూడా స్థిరపడుతున్నారు. ఆయన తన వాల్ పోస్టర్ బ్యానర్ పై ఇప్పటికే పలు చిన్న సినిమాలు నిర్మించి హిట్ కొట్టారు. తక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. అయితే అలాంటి నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా మూవీ కోర్టు(Court) .. ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తున్న కోర్టు మూవీ మార్చి 14న విడుదలకు సిద్ధంగా ఉండడంతో.. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు నాని. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెడుతున్నారు. అలా తాజాగా కోర్టు మూవీ ప్రెస్ మీట్ లో నానికి శ్రీకాంత్ ఓదెల – చిరంజీవి సినిమాకు సంబంధించి ఓ ప్రశ్న ఎదురవ్వగా గుడ్ న్యూస్ చెప్పారు.నాని మాట్లాడుతూ..”మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు త్వరలోనే స్టార్ట్ అవుతుంది.ఇక ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు” క్లారిటీ ఇచ్చారు నాని.అయితే చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమాని నాని(Nani) తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.


విడుదలకు ముందే రూ.3కోట్ల లాభాల్లో కోర్టు మూవీ..

ఇక ప్రియదర్శి నటించిన కోర్టు మూవీ విషయానికి వస్తే..నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఓటీటి డీల్ కూడా ఫిక్స్ అయిపోయింది.కోర్టు మూవీ ని నెట్ ఫ్లిక్స్ ఓటిటి సంస్థ ఏకంగా 9 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే..ప్రియదర్శి (Priyadarshi) నటించిన కోర్టు మూవీకి పెట్టిన బడ్జెట్ కేవలం రూ.6 కోట్లు మాత్రమే.కానీ నెట్ ఫ్లిక్స్ ఓటిటి సంస్థనే ఈ మూవీని ఏకంగా రూ.9 కోట్లకు కొనుగోలు చేయడంతో సినిమా రిలీజ్ కి ముందే రూ.3కోట్ల లాభాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక శాటిలైట్ డీల్ కాకముందే ఓటిటితోనే మూడు కోట్ల లాభం అందుకుంది కోర్టు మూవీ. ఇక ఈ సినిమా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే గనుక సినిమాకు మరిన్ని లాభాలు రావడం ఖాయం అంటున్నారు ఈ విషయం తెలిసిన అభిమానులు. అలా హీరో నాని చాలా తెలివిగా తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ నిర్మాణ రంగంలో కూడా రాణిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×