BigTV English

Nani : ఒక కథ కూడా ఎక్సైట్ చెయ్యలేదు, బాలీవుడ్ ఎంట్రీ పై నాని రియాక్షన్

Nani : ఒక కథ కూడా ఎక్సైట్ చెయ్యలేదు, బాలీవుడ్ ఎంట్రీ పై నాని రియాక్షన్

Nani : ఈ రోజుల్లో ఆడియన్స్ థియేటర్ కు వచ్చి ఒక సినిమా చూడాలంటే అది ఎంతో గొప్ప కథ అయి ఉండాలి. ఎందుకంటే ఒక మామూలు సాదాసీదా కథను థియేటర్ కు వచ్చి చూడడానికి ఆడియన్స్ ఇప్పుడు రెడీగా లేడు. అందుకే చాలామంది తెలుగు హీరోలు ఒక కథను ఒప్పుకోవడానికి ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా హీరోలకు మొహమాట ఉండకూడదు. ఒక కథ వాళ్లకు నచ్చలేదు అంటే అది నచ్చలేదు అని చెప్పగలగాలి. లేదు అంటే ఆ కథను ఒప్పుకొని సినిమా చేయటం వలన చాలా నష్టం కలుగుతుంది. ఆ హీరో కెరియర్ డౌన్ అవడం మాత్రమే కాకుండా నిర్మాతకు కూడా నష్టాలు వస్తాయి. ఆడియన్స్ కు విసుగు వస్తుంది. వీటన్నిటి విషయంలో నాని కొంచెం జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పాలి. నాని కథలను ఎంచుకునే విధానం ఇప్పటికి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


జెర్సీ తర్వాత మార్పు

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతోపాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థకి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ సినిమాలో నాని పర్ఫామెన్స్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా 30 ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ సినిమా పర్సనల్ గా ఎక్కడ టచ్ అయింది. ఆ సినిమా తర్వాత నాని కథలను ఎంచుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది. ప్రతి సినిమాలో కూడా వేరియేషన్ తీసుకొస్తున్నాడు. నాని ఒకటే యాక్టింగ్ చేస్తాడు అనే దగ్గర నుంచి నాని ఏదైనా చేయగలడు అనే స్థాయి వరకు నాని స్టోరీ సెలక్షన్స్ వచ్చేసింది. ఇక ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా హిట్ 3. సినిమా మే 1న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు నాని.


నాని బాలీవుడ్ ఎంట్రీ.?

బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాస్త వెనకబడింది కానీ ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మంచి స్థాయిలో ఉండేది ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని చూసి భారీ బడ్జెట్ సినిమాలు చేసి నష్టాలు చవిచూస్తుంది. అయితే హీరో నాని బాలీవుడ్ ఎంట్రీ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ దర్శకులు నానికి కథ చెప్పారట. కానీ ఒక్క కథ కూడా నానిని ఎక్సైట్ చేయలేదు. అలానే నాని కెరియర్ లో ఎప్పుడు వరుసగా మూడు సినిమాలు లైన్ లో ఉంటాయి. ఒక కథ ఎక్సైట్ చేయగలిగితే నేను ఖచ్చితంగా బాలీవుడ్ లో సినిమా చేస్తాను అంటూ నాని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also Read : Karthik Subbaraj : నేను గేమ్ చేంజర్ సినిమాకు వన్ లైన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చా

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×