OTT Movies : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే.. ఇటీవల డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారమవుతున్న సినిమాలకు వెబ్ సిరీస్ లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది.. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండడంతో వెబ్ సిరీస్ లు ఎక్కువగా మంచి వ్యూస్ ని రాబడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈమధ్య వచ్చిన వెబ్ సిరీస్ లో మంచి టాప్ ని సొంతం చేసుకోవడంతో ఎక్కువగా సినిమాల కన్నా ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కొత్త వెబ్ సిరీస్ లు మాత్రమే కాదు. పాత ఇంట్రెస్టింగ్ ఉన్నవి కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఉన్న వెబ్ సిరీస్ లలో ఒక దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
వెబ్ సిరీస్ & ఓటీటీ..
వెబ్ సిరీస్ లు ఎక్కువగా లాజిక్ తో వస్తున్నాయి. ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ సిరీస్ లను చూస్తున్నారు. తాజాగా ప్రేక్షకులకు మనసు దోచుకున్న వెబ్ సిరీస్ లలో అశుబ్ వివాహ్ కూడా ఒకటి. ఇది ఒక హింది వెబ్ సిరీస్.. హిందీ వెబ్ సిరీస్ ల కథలు ఎలా ఉంటాయో ఒకసారి అందరికి తెలుసు.. అయాన్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ పేరు అశుబ్ వివాహ్.. టైటిల్ కు తగ్గట్లే స్టోరీ కూడా ఉంటుంది. పెళ్ళైన ఒకరోజు తర్వాత ఆ ఇంట్లో జరిగే పరిస్థితులను చూసి కొత్తగా వచ్చిన అమ్మాయి ఎలా తట్టుకుంటుంది. అనేది ఈ సిరీస్ సారాంశం..
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే..
స్టోరీ విషయానికొస్తే..
ఈ వెబ్ సిరీస్ పేరు అశుబ్ వివాహ్.. ఇది ఒక హత్య మిస్టరీ సిరీస్, ఇక్కడ ఒక వివాహ జోస్యం విషాదకరంగా నిజమవుతుంది, దీని ఫలితంగా కొత్త వధువు దేబి తన భర్త కుటుంబంలోని రహస్యాలు కుంభకోణాల వలయంలో చిక్కుకుంటుంది. కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగు పెట్టిన పెళ్లి కూతురు కు మొదటి రోజే షాక్ తగులుతుంది. అక్కడ పరిస్థితులను చూసి ఆమె ఖంగు తింటుంది.. అక్కడ వాళ్లు వావి వరుసలు లేకుండా ఎవరైన ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ ను బట్టి మగవాళ్ళు, ఆడవాళ్లు ఇంటిమెట్ అవుతారు. సిరీస్ మొత్తం అలానే ఉంటుంది. అయితే పెళ్లి కూతురు గదిలో పెళ్ళైన ఒక్కరోజుకే భర్త చనిపోతాడు. పోలీసులకు విషయం తెలుస్తుంది. వచ్చి రాగానే కొత్త పెళ్లి కూతురును ఇబ్బంది పెట్టి అడుగుతారు. అది చూసిన ఆమె భయపడి పోతుంది. మోసపోయానని తెలుసుకుంటుంది. ఆశుభ్ వివాహ ప్రైమ్ వీడియో మరియు హాట్‌స్టార్‌లలో అందుబాటులో ఉంది . మీరు దీన్ని ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ లో కూడా చూడవచ్చు. ఈ మర్డర్ మిస్టరీలో సౌమిత్రిషా కుందు, అనుజాయ్, ఇంద్రసిస్ రాయ్, రాజాదీప్ గుప్తా.. వంటి తదితరులు ఈ సిరీస్ లో నటించారు..