BigTV English

Nani : నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గ్రేటెస్ట్ మూమెంట్ అది

Nani : నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గ్రేటెస్ట్ మూమెంట్ అది

Nani : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ఎప్పటికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా కూడా కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుంటాయి. కానీ అలాంటి సినిమాలు ఎప్పుడు రావు ఎప్పుడో వస్తాయి.
అలా నాని కెరియర్ లో వచ్చిన సినిమా జెర్సీ. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో నాని అర్జున్ అనే ఒక పాత్రలో కనిపించాడు. నాని ఈ సినిమాలో జీవించిన విధానం చాలామందికి విపరీతంగా ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాతే నాని కథలను ఎంచుకునే విధానం కూడా కంప్లీట్ గా మారిపోయింది అని చెప్పాలి. అందుకే ఇప్పుడు ఏ సినిమా చేసిన అది ప్రత్యేకంగా ఉంటుంది అని చాలామంది ఆడియన్స్ కి ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. నాని కెరియర్ లో జెర్సీ సినిమాకి అంతటి ప్రత్యేకత ఉంది.


జెర్సీ కథ

ఈ సినిమా కథ విషయానికి వస్తే అర్జున్ అనే ఒక క్రికెటర్ తనకున్న పరిస్థితులు వలన క్రికెట్ ను ఆపేయాల్సి వస్తుంది. ఆ తర్వాత 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆ 36 సంవత్సరాల వయసులో మళ్లీ అర్జున్ క్రికెట్ ఆడటం ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడం. అసలు ఏదైనా సాధించాలి అంటే ఏజ్ తో సంబంధం లేదు అని చూపించడం, వంటి అంశాలు ఈ సినిమాలో మంచి ప్లస్ పాయింట్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాని పర్ఫామెన్స్. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ వీటన్నిటిని మించి గౌతమ్ తిన్ననూరి రైటింగ్. ఇవన్నీ కూడా ఒకదానిని ఒకటి డామినేట్ చేసి సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా మలిచాయి.


జెర్సీ ఎక్స్పీరియన్స్

రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆల్రెడీ చూసిన సినిమా అయినా కూడా థియేటర్లో చూస్తే అక్కడ వచ్చే ఆనందం వేరు. ఒక 800 మంది క్రౌడ్ మధ్యలో ఒక సినిమాను చూడటం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. జెర్సీ సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు. అయితే దాదాపు 800 ప్రేక్షకులు మధ్య నాని తన కొడుకుతోపాటు ఆ సినిమాను చూశాడు. అయితే ఈ సినిమాలో నాని మ్యాచ్ ఆడిన తర్వాత తన కొడుకు నానికి చేతులు తల కిందకి దించి అభినందనలు తెలియజేస్తాడు. సరిగ్గా ఇదే సీన్ వచ్చినప్పుడు థియేటర్లో అందరూ కూడా ఇలానే చేయడం నానికి చాలా ఆశ్చర్యం కలిగించింది. పక్కనే తన ఐదు సంవత్సరాలు కొడుకుతో ఈ సీన్ చూడటం అనేది తను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అంటూ నాని చెప్పుకొచ్చాడు.

Also Read : Raj Tarun-Lavanya: రాజ్ తరుణ్ చేసిన మిస్టేక్ ఇదే.. అడ్డంగా దొరికిపోయాడు..

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×