Supermarket In Theft: అనంతపురంలో ఓ ఫ్యామిలీ సూపర్ మార్కెట్లో దొంగతనానికి పాల్పడింది. సీసీ కెమరాలు ఉన్నాయని కూడా పూర్తిగా మర్చిపోయి.. వారు తెచ్చుకున్న బాగ్‌తో సహా ..మరొక బ్యాగ్‌లో కూడా అక్కడున్న వస్తువుల్ని కాజేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారాన్ని సీసీ కెమరాలో గమనించిన షాపు ఓనర్ ప్రశ్నించేసరికి.. షాపు ఓనర్ పైనే ధౌర్జన్యానికి దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. కార్లో వచ్చినా కక్కుర్తి మాత్రం పోలేదు. చిన్న సూపర్ మార్కెట్లో సరుకులు దోచేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. కౌంటర్ దగ్గర ప్రశ్నించిన సూపర్ మార్కెట్ యజమానురాలిపై భార్యాభర్త దౌర్జన్యం చేయడమే కాకుండా.. కారు డ్రైవర్‌తో సహా మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.
అనంతపురం జిల్లా శాంతినగర్‌లో జరిగిందీ ఘటన. భార్యాభర్తలు దర్జాగా షాపింగ్‌కు వచ్చారు. కొన్ని సరుకుల్ని బాస్కెట్‌లో వేసుకున్నారు. మరికొన్నిటిని సెపరేట్ బ్యాగ్‌లో నింపుకున్నారు. కస్టమర్లు తక్కువగా ఉండడంతో.. సీసీకెమెరాల్లో అందర్నీ గమనిస్తూ ఉన్నారు ఓనర్ మహిళ. బిల్లింగ్ దగ్గర కక్కుర్తి కపుల్‌ను ఆమె ప్రశ్నించారు. దీంతో సదర కస్టమర్ మహిళ రెచ్చిపోయింది. మమ్మల్ని అవమానిస్తున్నావంటూ ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. సూపర్ మార్కెట్ ఓనర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సీసీ కెమెరాల్లో మీ నిర్వాకం చూశానంటూ నిలదీశారు. తమ బండారం బయటపడిపోయిందని గ్రహించిన కిలాడీ భార్యాభర్తలు.. ఆమెపై దాడికి పాల్పడ్డారు. వాళ్ల కారు డ్రైవర్ కూడా ఎటాక్ చేశాడు.
సీసీకెమెరా ఫుటేజ్‌లో ఆ కపుల్ కక్కుర్తి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్లు దాడికి పాల్పడడంతో భయంతో ఓనర్ మహిళ పారిపోయింది. ఓ రూమ్‌లో దాక్కునే ప్రయత్నం చేసింది. అయినా ఆ కక్కుర్తి కపుల్, కారు డ్రైవర్ ఆమెను వదల్లేదు. ఒంటరి మహిళ అనే జాలి, దయ కూడా లేకుండా రూమ్ డోర్ ముక్కలయ్యేలా కండబలంతో ఎటాక్ చేశారు.
ఈ సీన్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. షాపు ఓనర్ కంప్లైంట్ ఇవ్వడంతో .. పోలీసులు ఆరా తీసారు. ఓనర్‌పై దాడి చేసి, షాపును ధ్వంసం చేసిన ముగ్గురిని.. నాగమణి, లోక్ నాధ్ , దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మెరుపు వరదలు.. 40 ఇళ్లు ధ్వంసం.. ఎంత మంది చనిపోయారంటే..
ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో చైన్ స్నాచర్లు అలజడి సృష్టిస్తున్నారు. మొన్నటి వరకు రోడ్ల మీద, మహిళల మేడలోంచి బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇప్పుడు రూట్ మార్చేశారు. ఈ మధ్య కొందరు కేటుగాళ్లు టూలెట్ అని బోర్డు పెట్టిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఇళ్లు అద్దె ఎంత..అని అడగడానికి ఇంట్లోకి వెళ్లి మహిళల మెడలో నుంచి బంగారు చైన్ లు ఎత్తుకెళ్తున్నారు. లేటెస్ట్‌గా సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓల్డ్ బీపీఎల్ కాలనీలో బాలమణి అనే వృద్దురాలి మేడలోంచి 5 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు కేటుగాడు.
టూ లెట్ బోర్డు ఉన్న షట్టర్.. అద్దెకు కావాలంటూ ఓ యువకుడు వచ్చాడు. షట్టర్ చుపించిన తరువాత మంచి నీళ్ళు కావాలని అడగడంతో వృద్దురాలు ఇంట్లోకి వెళ్లింది. దీంతో వెంటనే ఎవరు లేరని గమనించి ఇంట్లోకి వెళ్లిన చైన్ స్నాచర్.. మంచి నీళ్ళు తీసుకొని వస్తున్న వృద్దురాలిని నెట్టేసి మెడలోని 5 తులల బంగారు చైన్ లాక్కోని వెంటనే బయట డోర్ గడియ పెట్టి పారిపోయాడు. వృద్దురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే ఇంట్లోకి వచ్చి చూడగా..మెడలోని గోలుసు లాక్కోని వెళ్ళాడని చెప్పడంతో మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచర్ బైక్ పై వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న వీడియోలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు..