Tamannaah:ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah) తాజాగా ఏప్రిల్ 18వ తేదీన ‘ఓదెల 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక ప్రేతాత్మ నుండి ఊరిని కాపాడే నేపథ్యంలో శివశక్తిగా తమన్నా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే విషయాన్ని ఇందులో చాలా చక్కగా చూపించారు. ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం అదరగొట్టేసారనే చెప్పాలి. ప్రత్యేకంగా ఆ మహా శివుడే దిగి వచ్చారేమో అని చాలామంది దండం పెడుతున్నారు అంటూ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో ఈమెకు సౌత్లో అవకాశాలు వచ్చి పడతాయి అని అనుకున్నారు కానీ బాలీవుడ్లో భారీ ప్రాజెక్టులో అవకాశం లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆ బయోపిక్ లో నటించనున్న తమన్నా..
బాలీవుడ్లో ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ లో నటించడానికి తమన్న సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే గత ఏడాది ‘వేద’ సినిమాలో జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం (John Abraham), అందాల తార తమన్నా. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ హిట్ జోడి మరొకసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా.. రోహిత్ శెట్టి (Rohith Shetty) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేయడం జరిగింది. తమన్నా ఈ సినిమాలో రాకేష్ మారియా భార్య ప్రీతి పాత్రలో కనిపించనుంది. ముఖ్యంగా రాకేష్ కెరియర్ కు మూల స్తంభం ఆయన భార్య ప్రీతి, ఉగ్రవాదుల నుంచి నగరాన్ని రక్షించడంలో నిమఘ్నమైన తన భర్తకు అన్నివేళలా తోడుగా నిలిచింది. ఇలాంటి కీలకపాత్రలో ఈ సినిమాలో ఆ పాత్రకు ప్రాణం పోయడానికి తన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషంగా ఉందని తమన్నా చెప్పినట్లు చిత్ర వర్గాలు కూడా చెబుతున్నాయి. మొత్తానికి అయితే బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హిట్ జోడి మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన తమన్నా..
తమన్నా విషయానికి వస్తే.. మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ మొదలుకొని కోలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ మంచి పేరు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టేటస్ తో అదే స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ (Prabhas) ను మొదలుకొని రామ్ చరణ్, ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, చిరంజీవి వంటి దిగ్గజ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.