The Paradise Film : నేచురల్ నాని (Nani) – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Sikanth odela) కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ (Dasara) మూవీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘దసరా’ సినిమాలో నాని ఊర మాస్ అవతార్లో కనిపించి ప్రేక్షకులకు అదిరిపోయే మాస్ ట్రీట్ అందించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise Film). ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నాని – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ రెండవ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఒక గ్లిమ్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నాని లుక్, గెటప్ అన్నీ ఊర నాటుగా ఉన్నాయి. అలాగే డైలాగులు కూడా తెలంగాణ యాసలో ఉన్నాయి. కానీ టీజర్ లో నాని లుక్, డైలాగ్స్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అనే రూమర్లు మొదలయ్యాయి.
‘ది ప్యారడైజ్’ మూవీ హాలీవుడ్ మూవీకి కాపీనా?
‘ది ప్యారడైజ్’ టీజర్ లో నాని బ్లడ్ బాత్ మామూలుగా లేదు. రెండు జడలు వేసుకుని, రా అండ్ రస్టిక్ లుక్ లో నాని కనిపించిన తీరు సరికొత్తగా అనిపించింది. ఈ మూవీని తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు స్పానిష్ ఇంగ్లీష్ లాంటి విదేశీ భాషల్లో కూడా మార్చి 26న రిలీజ్ చేయబోతున్నారు. కానీ అంతలోనే ‘ది ప్యారడైజ్’ మూవీ హాలీవుడ్ సినిమా కథకు కాపీ అనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఆ రూమర్ల సారాంశం ఏంటంటే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సిటీ ఆఫ్ ద గాడ్’ ఆధారంగా ‘ది ప్యారడైజ్’ మూవీని తెరకెక్కిస్తున్నారు అనే రూమర్లు విన్పిస్తున్నాయి. అంతేకాకుండా ‘సిటీ ఆఫ్ ద గాడ్’, ‘ది ప్యారడైజ్’ రెండు పోస్టర్లను పక్కపక్కనే పెట్టి, ఇదే ప్రూఫ్ అని కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
‘సిటీ ఆఫ్ ద గాడ్’ స్టోరీ ఇదే
కేవలం పోస్టర్స్ మాత్రమే కాదు, తాజాగా రిలీజ్ చేసిన ‘ది ప్యారడైజ్’ గ్లిమ్స్ చూస్తే కాపీ ఆరోపణలు నిజమే కదా అనిపించక మానదు. ఎందుకంటే ‘ద సిటీ ఆఫ్ గాడ్’ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడు పేదరికంపై పోరాటం చేస్తాడు. పేదవాళ్లకు నాయకుడిగా నిలవడానికి చేయకూడని పనులన్నీ చేస్తాడు. ‘ది ప్యారడైజ్ల్ గ్లిమ్స్ లో కూడా ఇదే స్టోరీ లైన్ కనిపించింది. ముఖ్యంగా “చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిన్రు గాని.. గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ… జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ… పాలు లేక రక్తంబోసి పెంచిన జాతి కథ’ అనే డైలాగ్స్ వింటే రెండు సినిమాలు నిజంగానే ఒకే విధంగా ఉన్నాయి అని అన్పించకమానదు. మరి దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.