Kiwi Benefits: కివీ ఒక రుచికరమైన, పోషకాలు పుష్కలంగా కలిగిన పండు. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కివీ ఫ్రూట్ తింటే.. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం వంటి అనేక ముఖ్యమైన శరీర ప్రక్రియలు మెరుగుపడతాయి.
కివీ ఫ్రూట్ బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా చర్మ ఆరోగ్యం, కంటి చూపు , రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ ఫ్రూట్‌ను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. మరి కివీ ప్రూట్ యొక్క మరిన్ని ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కివీ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
విటమిన్ సి కి మంచి మూలం:
కివి విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కివీ ఫ్రూట్‌ని క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరమైన బలాన్ని శరీరానికి ఇస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
కివీ లో ఒక ప్రత్యేక ఎంజైమ్ (ఆక్టినిడిన్) ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి , జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు:
కివీ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం , ఫైబర్ ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కివీని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గుతుంది. అంతే కాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
చర్మ ఆరోగ్యం:
కివీ ప్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ సి ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ,ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అంతే కాకుండా చర్మ స్థితి స్థాపకతను మెరుగుపరుస్తుంది. ముడతలను కూడా తగ్గిస్తుంది. కివీ ఫ్రూట్ తినడం వల్ల చర్మం మెరుగుపడుతుంది వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది.
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. జన్మలో జుట్టు రాలదు !
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
కివీ ఫ్రూట్‌లో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడానికి అనువైన పండు. ఎందుకంటే ఇది జీవక్రియను పెంచుతుంది . శరీరం నుండి వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపుతుంది. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యం:
కివీ ఫ్రూట్‌లో కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన లుటిన్ , జాంథిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ మూలకాలు రెటీనా దెబ్బతినకుండా రక్షించడానికి , దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కివీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిశుక్లం , ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.