BigTV English

Nani Movie : రిలీజ్‌ కాదు.. షూటింగ్‌కు ముందే 100 కోట్లు రిటర్న్… నిజంగా ఇది నాని మూవీనేనా..?

Nani Movie : రిలీజ్‌ కాదు.. షూటింగ్‌కు ముందే 100 కోట్లు రిటర్న్… నిజంగా ఇది నాని మూవీనేనా..?

The Paradise : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది రెండు సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాని ఈ ఏడాది కూడా మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా యాక్షన్, ఎంటర్టైనర్ కథతో థియేటర్లలో రిలీజ్ అయిన హిట్ 3 మూవీతో మరో బ్లాక్ బాస్టర్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అందరి చూపు ది ప్యారడైజ్ సినిమా పై పడింది.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ మ్యూజికల్ రైట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ ప్రముఖ సంస్థ భారీ ధరకు ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసిందని తెలుస్తుంది.. ఆ వివరాల గురించి ఒకసారి చూసేద్దాం..


ప్యారడైజ్ బిజినెస్ వివరాలు..

నాని ఒక్కో మూవీకి వెరియేషన్ చూపిస్తున్నాడు. ఇటీవల వచ్చిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మే 1 న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే మరో రికార్డు ను బ్రేక్ చేసింది. ఈ మూవీ బిజినెస్ వివరాలను చూస్తే.. వందకోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 65 కోట్లకు డీల్ కుదుర్చుకుందని టాక్. అలాగే ఆడియో హక్కులను ‘సరిగమ గ్లోబల్’ సంస్థ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు 70 శాతం కలెక్షన్స్ ని వసూలు చేసినట్లు తెలుస్తుంది..


Also Read : మరోసారి బాయ్ ఫ్రెండ్ తో దొరికిన శ్రీలీల.. అడవుల్లో ఏం పని..?

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుంది. 1960 బ్యాక్ డ్రాప్లో రాబోతున్నట్లు తెలుస్తుండగా.. నేచురల్ స్టార్ నాని పూర్తిగా డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘ది ప్యారడైజ్’ తెరకెక్కినట్లు గ్లింప్స్, పోస్టర్స్ను బట్టి తెలుస్తోంది. ఈ మూవీలో లుక్ కోసం నాని స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఎస్ఎల్వీ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వేరే లెవల్ అన్నట్లు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీ మొత్తం ఒక తెగ గురించి చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే సరికొత్త కథతో నాని ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. హీరో నాని గత కొన్నేళ్లుగా ఒక్కో సినిమాకు వెరియేషన్ చూపిస్తున్నాడు. లుక్ ను మారుస్తున్నాడు. ప్రతిదీ సక్సెస్ అవుతుంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×