BJP leader Viral Video: ఉత్తర ప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు బబ్బన్ సింగ్ రఘువంశీ.. ఒక మహిళా నృత్యకారిణితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో బబ్బన్ సింగ్ ఓ వివాహ కార్యక్రమంలో నర్తకి అతని దగ్గరికి వచ్చి నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె డాన్స్ చేస్తూ.. అతని కాళ్లమీద కూర్చోబెట్టుకుని తన ప్రైవేటు బాడీ పార్ట్స్ ను టచ్ చేయడం, అదేవిధంగా ముద్దుపెట్టడం వంటివి అసభ్యకరమైన ప్రవర్తించినట్లు కనిపించింది.. అయితే అక్కడున్న వారు బీజేపీ నాయకుడిని ఆపకుండా.. చప్పట్లు కొట్టడం స్టార్ చేశారు. కొంత మంది వెనక నుండి అరవడం, మహిళా నృత్యకారిణిపై బీజేపీ నాయకుల సహచరులు డబ్బుల వర్షం కురిపించారు.
ఈ వీడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై బబ్బర్ సింగ్ స్పందించారు. ఈ వైరల్ అయిన వీడియో పాతదని, బీహార్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు సంబంధించినదని చెబుతున్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే అక్కసుతోనే నాపైన ఇలాంటి అలిగేషన్స్ వేస్తున్నారంటూ బబ్బన్ సింగ్ ఆరోపించారు. ఈ వీడియో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని బబ్బన్ సింగ్ పేర్కొన్నారు.
తాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ బంధువని రఘవంశీ చెప్పారు. బీజేపీ కూడా తనను బన్స్‌దిహ్ అసెంబ్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయించిందని ఆయన అన్నారు. బన్స్‌దిహ్ ఎమ్మెల్యే కేత్కి సింగ్ రాజకీయ విజయాలను కించపరచడానికి ఆమె మద్దతుదారులు ఈ తప్పుడు వీడియోను వైరల్ చేశారు. దీనిపై పోలీస్ సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే ఆ వీడియోలో ఉన్నది బబ్బన్ సింగ్ అని క్లియర్‌గా కనిపిస్తుంది.. కానీ అది ఫేక్ వీడియో అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుందని చెబుతున్నారు. అలా ఉండి ఇలాంటివి చేస్తూ.. సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ నెటిజన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు.
Also Read: చూడగానే గుండె జారిందా? ఈ బిల్డింగ్ డిజైన్ చూస్తే ఏం గుర్తొస్తోంది?