BigTV English

Fruit Face Pack: ఫ్రూట్ ఫేస్ ప్యాక్.. ఇలా చేస్తే గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ

Fruit Face Pack: ఫ్రూట్ ఫేస్ ప్యాక్.. ఇలా చేస్తే గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ

Fruit Face Pack: వేసవి కాలంలో మన ముఖానికి పోషణ ముఖ్యం. గ్లోయింగ్ స్కిన్ కోసం సహాయపడే కొన్ని ఫేస్ ప్యాక్‌లు కూడా ఉన్నాయి. వేసవిలో లభించే పండ్ల సహాయంతో మనం ఈ ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మన చర్మం మెరుస్తుంది. అంతే కాకుండా తెల్లగా అందంగా కనిపిస్తాము. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫ్రూట్‌తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మామిడి ఫేస్ ప్యాక్:
మామిడితో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి.. 2-3 టీ స్పూన్ల మామిడి గుజ్జును తీయండి. తర్వాత అందులో కొంచెం కోల్డ్ క్రీమ్, చల్లని పాలు బాగా కలిపి పేస్ట్ లా చేయండి. మీకు కావాలంటే.. మీరు కోల్డ్ క్రీమ్‌కు బదులుగా క్రీమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత.. ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

పుచ్చకాయ ఫేస్ ప్యాక్:
పుచ్చకాయ తినడం వల్ల మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని మనందరికీ తెలుసు. మీరు మీ ముఖానికి పుచ్చకాయ గుజ్జును అప్లై చేసినట్లయితే.. చర్మ రంధ్రాలు కూడా హైడ్రేషన్ ప్రయోజనాన్ని పొందుతాయి. ఈ ఫేస్ ప్యాక్ కోసం కాస్త పుచ్చకాయ గుజ్జులో పెరుగు బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. దాదాపు 15-20 నిమిషాల తర్వాత, మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయండి.


కివీ ఫేస్ ప్యాక్:
కివీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. కివీతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ కూడా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కాస్త కివీ జ్యూస్ తీసి అందులో 1 టీ స్పూన్ తేనె కలపండి. మీకు కావాలంటే.. మీరు దానికి బాదం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దానిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

దోసకాయ ఫేస్ ప్యాక్:
దోసకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది మన శరీరానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవి కాలంలో మీ ముఖానికి హైడ్రేషన్ అందించాలనుకుంటే.. దోసకాయతో చేసిన ఫేస్ ప్యాక్ దీనికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం మీరు సగం దోసకాయను రుబ్బుకుని, అందులో కాస్త చక్కెర, పెరుగును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అరగంట పాటు ఉంచండి. దీని తరువాత.. మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.

Also Read: వాసెలిన్ ఇలా వాడితే.. చందమామ లాంటి ముఖం

టమాటో:
బంగాళదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని వాడటం వల్ల చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మంపై మచ్చలను తొలగించడానికి బంగాళదుంప రసాన్ని ఉపయోగించాలి. కాస్త బంగాళదుంపను మిక్సీలో రుబ్బుకుని, టాన్ అయిన ప్రదేశంలో నేరుగా అప్లై చేయవచ్చు. లేదా మీరు బంగాళదుంపను సన్నని ముక్కలను కోసి టాన్ ఉన్న ప్రదేశంలో రుద్దండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు కూడా తొలగిపోతాయి.

 

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×