BigTV English

Hit 3 Movie : నాని మూవీ ప్రమోషనల్ టూర్ ప్లాన్, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు

Hit 3 Movie : నాని మూవీ ప్రమోషనల్ టూర్ ప్లాన్, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు

Hit 3 Movie : ఈ రోజుల్లో థియేటర్స్ కి ఆడియన్స్ రావడం మానేశారు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద సినిమా వచ్చినా అది బాలేక పోతే కేవలం రెండు రోజుల్లో తేలిపోతుంది. అలానే ఎంత మంచి సినిమా వచ్చినా కూడా అది జనాల్లోకి వెళ్ళకపోతే అది ఎప్పుడు రిలీజ్ అయి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం చాలా సినిమాల పరిస్థితి అలానే తయారయింది. మంచి సినిమాలు వస్తున్నా కూడా ప్రేక్షకులు థియేటర్ కు రాని పరిస్థితి ఎదురైంది. రీసెంట్ టైమ్స్ లో యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ మాత్రమే బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకు మంచి ఉదాహరణ సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ, రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన కోర్టు సినిమాలో అని చెప్పాలి. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ వంటి సినిమాలు కూడా బాగానే ఆడాయి. అయితే థియేటర్స్ కి ఆడియన్స్ రావడం తగ్గించేశారు అనేది మాత్రం వాస్తవం.


హిట్ 3 సిద్ధం

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన నాని నటుడిగా అడుగులు వేస్తూ నేడు సక్సెస్ఫుల్ హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. నాని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు కూడా సాధించుకున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వైజాగ్ వేదికగా విడుదల చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. సైంధవ్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఈ సినిమాను చాలా కష్టపడి పగడ్బందీగా తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్ కొలను. చాలామంది దర్శకులు లాగా దాయకుండా నా చివరి సినిమా మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోయింది క్షమించండి అంటూ మాట్లాడిన వ్యక్తిత్వం దర్శకుడిది.


జనాల్లోనికి నాని

ఈ సినిమాకి సంబంధించి నాని విపరీతంగా ప్రమోషన్స్ చేయనున్నాడు.21 నుండి నాని ప్రమోషనల్ టూర్ ప్రారంభం కానుంది. చెన్నై, ముంబై, కొచ్చి, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి నాని ప్రమోషన్స్ చేయనున్నాడు. అలానే ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ను తిరుపతి లో ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా నాని ప్రమోషనల్ విషయంలో కూడా పకడ్బందీగా ఉన్నాడని చెప్పాలి. వైజాగ్ నుంచి మొదలుపెట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు చేరువయ్యలా ఈ సినిమాను తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని పారడైజ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఆ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 2026 లో ఆ సినిమా విడుదల కానుంది.

Also Read : Shankar Dada MBBS: చిరంజీవి నాన్నగారి కల నేటికీ నిజమైంది, వైద్య చరిత్రలోనే ఇది ఒక హఠాత్పరిణామం

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×