Travis head – Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025 )భాగంగా… మ్యాచ్లన్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ లో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ( Sunrisers Hyderabad ) చిచ్చు చేసిన ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా నాలుగు వికెట్ల తేడా తో… హైదరాబాద్ జట్టును ఓడించింది ముంబై ఇండియన్స్. అయితే ఈ మ్యాచ్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Surya kumar yadav wife : సూర్యకు ఇంట్లోనే శత్రువులు.. ఔట్ అయితే పెళ్ళామే నవ్వుతోంది భయ్యా
రోహిత్ శర్మకు లవర్ గా మారిన ట్రావిస్ హెడ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… నిన్న జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ కొట్టిన షాట్ ను అద్భుతంగా అందుకున్నాడు హైదరాబాద్ డేంజర్ ఆటగాడు హెడ్. దీంతో రోహిత్ శర్మ… పెవిలియన్ కు వెళ్లాడు. అయితే రోహిత్ శర్మ క్యాచ్ ను ఇప్పుడే కాదు… గతంలో కూడా ట్రావిస్ హెడ్ పట్టడం జరిగింది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య మూడు సార్లు… ఇలాంటి సంఘటన జరిగింది.
2023 వరల్డ్ కప్ సమయంలో… రోహిత్ శర్మ క్యాచ్ ను హెడ్ అందుకొని అవుట్ చేశాడు. ఇక 2024 t20 వరల్డ్ కప్ సమయంలో కూడా…. ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్… రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. ఇక నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా… రోహిత్ శర్మ క్యాచ్ ను హెడ్ అనుకున్నాడు. ఇలా వీరిద్దరి మధ్య… నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాదు నుంచి చేసిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన హైదరాబాద్ జట్టు 162 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. 18.1 ఓవర్లలోనే… ఆరు వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసి విజయం సాధించింది.
Also Read: Anaya Bangar: అనయ బంగర్ కామెంట్స్ దుమారం.. కొందరు క్రికెటర్లు ఆ*ఫోటోలు పంపేవారు
Rohit Sharma & Travis Head ~ Never Ending Love Story :
WC 2023 – Head took the catch of Rohit Sharma
T20 WC 2024 – Rohit took the catch of Travis Head
IPL 2025 – Head took the catch of Rohit Sharma #MIvSRH pic.twitter.com/jZbOxxL6ck
— Richard Kettleborough (@RichKettle07) April 18, 2025