BigTV English

Sobhita Dhulipala: అక్కినేని కోడలంటే మామూలుగా ఉండదు.. ఈ డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

Sobhita Dhulipala: అక్కినేని కోడలంటే మామూలుగా ఉండదు.. ఈ డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

Sobhita Dhulipala: హీరో, హీరోయిన్లు ఏదైనా ఈవెంట్‌లో కనిపించిన ప్రతీసారి వారి దుస్తులపైనే ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ దుస్తులను ఎవరు డిజైన్ చేశారు, దాని ధర ఎంత.. ఇలా అన్నీ తెలుసుకోవడం మొదలుపెడతారు. చాలావరకు సినీ సెలబ్రిటీలు దుస్తుల ధరలు చూస్తుంటే ప్రేక్షకులు షాకవ్వక తప్పదు. అసలు ఆ రేంజ్‌లో బట్టలు ఎలా కొంటారా అని ఆశ్చర్యపోతుంటారు. తాజాగా అక్కినేని పెద్ద కోడలు శోభితా ధూళిపాళ కూడా తన డ్రెస్ ధరతో అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా ఒక ఈవెంట్‌కు హాజరయిన శోభితా.. గోల్డెన్ కలర్ డ్రెస్‌లో అందరినీ అలరించింది. తను ఆ డ్రెస్‌లో బాగుండడంతో దాని ధర ఎంత అని ప్రేక్షకులు తెలుసుకోవడం మొదలుపెట్టారు.


ఫోకస్ పెరిగింది

అక్కినేని వారింటికి కోడలు అయిన తర్వాత శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)పై ఫోకస్ మరింత పెరిగింది. ఒక తెలుగమ్మాయి అయిన బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ బిజీగా గడిపేసింది శోభితా. అలా ఒకట్రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అప్పుడు శోభితా అంటే మంచి నటి అని మాత్రమే కొందరు తెలుగు ప్రేక్షకులు గుర్తించారు. కానీ తను ఎక్కువగా ఫోకస్ అయ్యింది మాత్రం నాగచైతన్యతో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాతే. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య.. శోభితాతో డేటింగ్‌లో ఉన్నాడు అనే వార్త బయటికి రాగానే తనపై ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది. ఇక అక్కినేని కోడలు అయిన తర్వాత శోభితా గురించి ప్రేక్షకుల్లో చర్చలు పెరిగాయి.


మినిమమ్ ఉండాలి

నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభితా ధూళిపాళ పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘తండేల్’ ప్రమోషన్స్‌లో బయటికి వచ్చినా అది నాగచైతన్యతోనే. కానీ తాజాగా శోభితా మొదటిసారి ఒక మూవీ ఈవెంట్‌కు అటెండ్ అయ్యింది. అందులో గోల్డెన్ కలర్ డ్రెస్‌లో తను మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ గోల్డెన్ కలర్ డ్రెస్ చూడడానికి సింపుల్‌గా అనిపించినా.. దాని ధర రూ.2.5 లక్షలు అని బయటపడింది. మొత్తానికి అక్కినేని కోడలు అంటే ఆ మాత్రం ఉండాలని, ధరించే డ్రెస్ ధర కనీసం లక్షల్లో లేకపోతే ఎలా అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి పెళ్లి తర్వాత శోభితా గ్లోకు చాలామంది ఫిదా అవుతున్నారు.

Also Read: దక్షిణాదిలో నాకు గుడి కట్టండి.. నార్త్‌పై ఊర్వశీ ఊహించని కామెంట్స్..

అవకాశాలు రాలేదు

హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు సాధించిన శోభితా ధూళిపాళ.. తెలుగులో అడవి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’తో డెబ్యూ చేసింది. ఈ మూవీ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి తెలుగులోనే మంచి రేటింగ్ సాధించిన స్పై థ్రిల్లర్‌గా రికార్డ్ సాధించింది. మూవీ హిట్ అవ్వడంతో శోభితాకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ దాని తర్వాత మళ్లీ తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. రెండోసారి కూడా అడవి శేష్‌తోనే కలిసి ‘మేజర్’ మూవీలో నటించింది. ఈ మూవీలో తను హీరోయిన్‌గా కాకపోయినా కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత తను నేరుగా అక్కినేని వారింటి కోడలు అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. మొత్తానికి అలా శోభితా పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×